Friday, October 12, 2012

కాబోయె శ్రీమతి కోసం కవిత

                                నాకు కాబోయె శ్రీమతి కోసం రాస్తున్న ఈ చిన్ని కవిత..తన పేరు పల్లవి.

పల్లవి.. నా హృదయ రాగాల పల్లవి..
చీర కట్టుతో నడిచే సింధూరానివి..
నాజూకు సోయగాలొలికె విరజాజివి..
నా గుండె చప్పుళ్ళకు నీవే సిరిమువ్వవి..
నా ఎద లోతుల్లో ఒదిగున్న చైత్రానివి..
చిత్రమైన కొన చూపుల చెలివి..
చిరునవ్వుల ముత్యాల జల్లువి..
ఇది వరకు నా బ్రతుకు కలల ఎండమావి..
నీ రాకతో ప్రతినిత్యం మోహనుని పిల్లన గ్రోవి..
ఈ ఒంటరి జీవితాన్ని కడ దాక నడిపించే జతవి..
ఇకపై నీవే నా ప్రతీ జన్మకి అవ్వాలి సీతవి..
నీవే నా కమనీయ కవితా లోకపు వెల్లువవి..
ప్రేమ బాటన నడిపించే వెన్నెలవి..
నా ఈ జీవితాన్ని మలుపు తిప్పిన కొత్త కధవి..

ప్రేమ శృతివి,రంగుల వసంతానివి,నా బుజ్జి బంగారానివి..


Monday, September 17, 2012

చిన్ననాటి నా మిత్రురాలు

చిన్ననాటి నా రెండో మిత్రురాలు ఫేస్ బుక్ లో దొరికిన శుభ సందర్భంగా..



చిన్ననాటి చెలిమైన ఓ జాబిలమ్మా..

ఇన్నాళ్ళు ఏ మబ్బుల వెనక దాగున్నావమ్మా?..

సప్త సముద్రాల ఆవల వున్న మల్లె పువ్వమ్మా..

నీ గురించి గుసగుసలాడాయిలే ఆ కొమ్మ రెమ్మ..

వెతికి పట్టాగా చివరికైనా నీ చిరునామా..

నా చిరస్మరనీయ స్నేహానికి చిత్రపటమా..

ఈవేల నవ్య రాగాల ఆనంద పరవశమా?..
నీవు నవ్వితే చాలు ముత్యాల వానమ్మ..

చీర కట్టులో నువ్వు ఓ కుందనపు బొమ్మ..

త్వరలో అవ్వాలి నువ్వు చక్కటి అమ్మ..

అదేగా అసలైన గొప్ప ఆడ జన్మ..

ఆనందంతో తుడవాలి నా కంటి చెమ్మ..

Sunday, September 16, 2012

చిన్ననాటి నా స్నేహం..

చిన్ననాటి నా మొదటి మిత్రురాలు ఫేస్ బుక్ లో దొరికిన శుభ సందర్భంగా..



స్నేహానికి మొదటి అర్థం నీవే,నా మొదటి స్నేహం నీవె..

బ్రతుకు పోరాటాన్ని నేర్పిన తొలి గురువు నీవే

నీతి శతకాలతో నడిపించిన మరో నాన్నవి నీవే..

ఆడించేటి,ఏడిపించేటి తొలకరి అల్లరి నీవే..

చేయిపట్టి నడిపించిన నేస్తమా,స్నేహ బాటను చూపిన వరమా..

ఈ మిత్రున్ని వీడి ఇన్నేళ్ళు ఎక్కడికి వెళ్ళావమ్మా?నీవు లేక ప్రొద్దుగూకుట భారమాయెన?

నడిపించే నీవు లేక,బ్రతుకు గమ్యం తెలియక నడిసంద్రంలోని నావలా పయనం లేక నిలిచిపొయేన?

ఎపుడోకపుడు కనిపిస్తావనుకొన్న,కాని ఆ'ఎపుడో' ఇపుడే అయ్యి తలపు చప్పుడులను ఆపి నిన్ను చూపింది.. 

మాటలు రావు, నీ చిన్ననాటి గుర్తులు తప్ప..

ఆకలి లేదు, మరిన్ని ఆనందాలు తప్ప..

ఆలోచనలు లేవు,నీ చిన్ని సొట్ట నవ్వు తప్ప..

చదువులేదు, మన స్నేహ మజిలీలొ అద్బుత పేజీలు తప్ప..

కాలమే పోదు, నీవు మటలాడిన క్షణాలు తప్ప.. 

Friday, September 7, 2012

మరి నిన్ను మరచేదెలా?



నిదుర లేస్తూనే చిగురిస్తున్నది నీపై ఆశల కల..
నీ వాలు చూపులతో వేశావు వలపుల వల..
ఉవ్వెతున ఎగిసిపడుతోంది నీపై ప్రేమ అల..
నీ నవ్వు మురిపిస్తోంది ఓ మెరుపులా..

నీ అంద అలరిస్తుంది కోనేటిలో తామర పువ్వుల..
నీ తియ్యని మాటలు ముత్యాల మాల..
మరి నిన్ను మరచేదెలా?

Thursday, September 6, 2012

నువ్వు తోడుంటే!



నీవు తోడుంటే చీకటిలోను పడమటి సంధ్యారాగమే..
నీవు తోడుంటే మనసుకి ప్రతి క్షణం పసితనమే..
నీవు తోడుంటే వయసుకు నెమలి నర్తనమే..
నీవు తోడుంటే మృదు తరుణాల మధువనమే..
నీవు తోడుంటే నవ్వులకు నిత్య యవ్వనమే..
నీవు తోడుంటే గుండెకు గోదారి పరవశమే..
నీవు తోడుంటే కలలకు మల్లె మాలికల వసంతమే...
నీవు తోడుంటే బ్రతుకు వెన్నెల్లో విహంగమే..
నీవు తోడుంటే జీవితం గలగల పారే జలపాతమే..
నీవు తోడుంటే ప్రతీ జన్మ సరిగమలతో సాగే సంగీతమే..

Monday, February 13, 2012

నా ప్రేమ వేదన!


సవ్వడి చేసే హృదయమా..
స్పందన లేక సద్దుమనిగావా!

స్వర్గానికెగసిన ప్రణయమా..
శాశ్విత నరకమై మిగిలిపొయావా!

అణువణువు నీవై అనంతమైన నా ప్రేమా..
విరహవేదనతో రగిలిపోతున్నవా!

నిత్య వసంతమైన నా పరువమా..
చిరునవ్వులు చెరిగి చితివైపొయావా!

కోటి కాంతుల నా ఆనంద పరవశమా..
తియ్యని కలలు లేక ఒంటరివై పోయావా!

ఈ ప్రేమికుల రోజును గతములా మారిన నీ పరిచయాలతో,అనుభూతులతో,మధుర స్మృతులతో గడుపుతున్నా ప్రియా!

ఇదే నా ప్రేమ వేదన!