Wednesday, November 24, 2010

నిను మరచిపొయేదెలా?



దేవతలా వచ్చింది జీవితానికి కొత్త ఆశలతో రంగులు అద్దడానికి,
స్నేహ హస్తాన్నిస్తూ అడుగులు వేసింది నా హృదయములోకి,
ఆకారాన్ని ఇచ్హింది నా కలలకి,అందులో విహరించడానికి,
కనిపించింది కనుమరుగయ్యి నా ప్రేమను కాలరాయడానికి,
కారణం అయ్యింది నాలోని ఓ కన్నీటి ప్రేమ కధకి
మిగిల్చింది ఆవేదనను నా మధికి,
తలవంచాను బలికావడానికి ఆ విధికి,విరహానికి
చేరుకొంది తన తీరానికి, కావడంలేదు తనను మరచిపోవడానికి..
కాలం ఒప్పుకోవడంలేదు దాసోహం అన్నా ఆ మృత్యువుకి..

Sunday, November 21, 2010

ఇదేమి లీలరా నీది శంకరా!..


గంగమ్మను నెత్తిన పెట్టుకోని తాండవమాడేవు,
ఇచ్చట తాగడానికి చుక్క నీరు లేకుండా చేసావు.
                                               ఇదేమి లీలరా నీది శంకరా!..


సురులను రక్షించుటకు గరళాన్ని కంఠంలో దాచి నీలకంఠుడవయ్యావు,
నీ బిడ్డలకు బాధలను మింగి పేదరికాన్ని గుండెల్లో జీర్ణించుకొనే శక్తినిచ్చావు.
                                               ఇదేమి లీలరా నీది శంకరా!..


ఈ భువిపై నువ్వున్న ప్రతిచోటా గౌరమ్మను,ఆమె సవతిని తోడుగా పెట్టుకొన్నావు,
మాకు మాత్రం నువ్వున్న ఇదే భువిపై కష్టాలను తోడుగా పెట్టావు.
                                              ఇదేమి లీలరా నీది శంకరా!..


నిత్యజ్ఞానివైన నీకు కార్తీకపౌర్ణమిన జ్యొతులను వెలిగించమ్మన్నావు,
కాని మమ్ము మాత్రం సత్యమేదో తెలుసుకోలేని అజ్ఞానంలో అలానే ఉంచావు.
                                               ఇదేమి లీలరా నీది శంకరా!..


నిత్య ధ్యానివై సర్వదేవతలచే ఆరాధనలు తీసుకొంటూ కైలాసములో ఆనందముతో 
వసించేవు,
ఈ కష్టాల కడలిపై మమ్ము త్రోసి ఆ ఒక వంతు భూమిని కూడా కన్నీటిమయము చేసావు,
                                               ఇదేమి లీలరా నీది శంకరా!..


నీకు రెండు కళ్ళుచాలవని మూడవ కన్నుని కూడా పెట్టుకొన్నావు,
పుట్టు గుడ్డివాళ్ళకు,ధన మధ కామ అహంకారులకు ఒక్క కన్ను కూడా లేకుండా చీకటిని ఇచ్చావు..
                                               ఇదేమి లీలరా నీది శంకరా!..


అవేకళ్ళను మూసి అదె చీకటిలో నిన్ను వెతికేవాల్లకి
పరమగతిని చూపి పరంజ్యోతివై పరమార్ధసిద్ధినిచ్చేవు...
                                               ఇదేమి లీలరా నీది శంకరా!..

Thursday, November 18, 2010

నేను ఆమెను ప్రేమించాను-1



అది ఓ దివ్యమైన రోజు,ఓ మధురమైన రోజు,ఓ ప్రత్యేకమైన రోజు,ఓ చిత్రమైన రోజు.అచ్చం గా నా రోజు.నా ప్రేమకు ఆది రోజు.ఎందుకంటే కంటి చూపుతో మనసును మీటేటి,చిత్రమైన నవ్వుతో హృదయాన్ని కట్టిపడేసేటి,సుగుణ లావణ్యంతో మధిని మొహన పరచేటి,పువ్వుల గుసగుసలల వలె మాటలు ఆ మాటల మంత్రములతో ముగ్దున్ని చేసెట్టి,కలలతో కాలాన్నిసైతం మరపించేట్టి,ఓ క్షణాన్ని అమృతమయం చేసి ఆ స్వర్గంలో నన్ను బంధించినట్టి,కమలపు శోభలతో ప్రకశించేట్టి ఓ సౌందర్య రాశిని,అనంతంవరకు నిలిచే ఆమె అందాన్ని,నా ఆనందానికి రూపమిచ్చినట్టి "ఆమెను"చూసాను.


తెలియని ఉల్లాసం ఎద నిండా అలుముకొంది.వెన్నెల కాంతులు మధి నిండా పులుముకొన్నాయి.గుండె చప్పుళ్ళ అలజడికి ఆశలకు అలికిడి రేగి కొత్త జీవితానికై నింగికి ఎగిసిపడ్డాయి.నాలోన నిదురొతున్న ప్రేమను తట్టి లేపాయి.నా హృదయ నిశీధిలోని చీకటి దారులను తన పాద స్పర్శలతో వెలుగుల మయం చేసాయి.నా ఊహల సామ్రాజ్యానికి చక్రవర్తిని అయ్యాను.తనను నా ప్రేమకు పట్టపు రాణి చేసి ఆ స్నెహలోకంలో మెమిద్దరమె బతికాము.నాలో ఓ ప్రేమాంకురం మొలిచెను.ప్రేమించనారంబించాను.


నేనూ ప్రేమించాను.నాలోని ఆమెను ప్రేమించాను.ఆమెను నన్నులా ప్రేమించాను.నాకై జన్మించిన ఆమెను ప్రేమించాను.ఈ జన్మకు ఆమెనే ప్రేమించాను.ఆమెకోసమె బ్రతికేలా ప్రేమించాను.నేను ఆమెలా మారిపొయేల ప్రేమించాను.ఆమె నాలొ సగబాగంలా ప్రేమించాను.నేను ఆమె ఒకటే అన్నట్టు ప్రేమించాను.నాకోసం ఆమెను ప్రేమించాను.నేనే ఆమె,ఆమే నేను అనేలా ప్రేమించాను.ప్రతిక్షణం ఆమెలో నన్ను,నాలో ఆమెను వెతికేలా ప్రేమించాను.కలల్లో,ఊహల్లో,నిదురలో,నడకలో,మాటలో,ఏకాంతంలో,తనువులోని అణువణువులో ఆమెను ప్రేమించాను.ప్రేమకై నేను చూపె ప్రేమను చూసి ఆ ప్రేమె ముచ్చటపడేలా ప్రేమించాను.ప్రేమ మయం ఈ జగత్తు అన్నట్టు ప్రేమించాను.
                                                                  (ఇంకా ఉంది..)


రచన
-మీ చక్రధర్

Wednesday, November 17, 2010

మరుగేల ఓ ప్రియా!..

 

నీ స్వరములు వరములై హృదయ తలుపులు తడుతూ ఉంటే,
నీ చూపులు భాణములై నా గుండెలను సంధిస్తూ ఉంటే,
నీ కలలు మలుపులై నా గమ్యంవైపు తప్పటడుగులు వేయనిస్తుంటే,
నీ నవ్వులు పువ్వులై నా మనసు వనంలో వికసిస్తూ ఎడబాటుతో ఏమారుస్తుంటే,
నీ రూపులు సుడిగాలులై నను చుడుతూ ఏకాంత లోకాలకు నెడుతూ ఉంటే,

నిన్ను మరవలేని స్థితి..ఏమి దిక్కుతోచని పరిస్థితి..
నీకై వేచిచూస్తూ అలసిపొయా..జీవితంవైపు అడుగులు వేయలేక సొలసిపొయా..

మరుగేల  ప్రియా!..కరుణించగ రావా..నా బ్రతుకులో కలిసిపొవా..

Tuesday, November 16, 2010

తెర తొలగదా?నిజమవ్వదా?

  

     ఎప్పటిలాగె చీకటి వీధుల్లో ఒంటరిగ నడుస్తున్నాను.ఓ రోజు మాత్రం ఉన్నట్టుండి నా పక్కనుండి సుంగధముల సువాసనలు,పారిజాత  పరిమళాలు,వీణా నాదాలు ,ఎదను హత్తుకొనేలా  కళ్యాణి రాగం ఇవన్ని గుంపులా చేరి నా పక్కనే నర్తించ సాగాయి నేను అదేదొ కొత్తలోకంలో ఉన్నట్టు.విచిత్ర  భావనలతో నా మధి పులకించింది..

  అమాంతమున నా చేతి పై తెలియని స్పర్శ.ఆ స్పర్శకి తనువు పులకించింది.వయస్సు తుల్లిపడ సాగింది.హృదయం గాలిలొ తేలినట్టు అయ్యింది.మది ఆనందంతో పరవళ్ళు తొక్కుంతోంది. ఎద సడి అలుపులేకుండా చిందులేస్తోంది. చిత్రమైన చిరునవ్వు.జీవితం ఓ రంగుల హరివిల్లులా అనిపించింది.

గుండె లిప్త పాటు లయతప్పినట్టు కాగా చిన్నపాటి వణుకుతో నెమ్మదిగ తల పక్కకి తిప్పి చూశాను.ఓ అప్సరస పాలమీగడతో తెలుపుని పులుముకొన్న చక్కటి చీరను దరించి పెదవులపై నుండి జారనివ్వని చిన్న చిరు నవ్వుతో నా కల్లలోకి చూస్తు నా చెతి ముని వేల్లను తన చేతితో పట్టుకోని తన వెంట తీసుకెల్లింది సరిగమలు కూడా నృత్యం చేసె ఓ విచిత్రమైన కొత్త లోకానికి.తన వెంట నడక సాగిస్తుంటే తన కురులు నా మోమును అలా తాకి వెళుతుంటే రెండు స్వర్గలోకాల మద్యన ఓ మెత్తటి వారధి పై నడుస్తున్నట్టు అనిపించింది.పక్కనుండి వీచే పిల్ల తెమ్మెరలు, తన మేని పరిమళాలు,తన నుండి వెలువడే వెచ్చటి శ్వాస నన్ను నేను మరచేల మైకాన్ని ఇస్తున్నాయి.ఆ క్షణం రసరాగమయంలా అనిపించింది.

    ఆ కొత్త బంగారు లోకం లో ఓ వెండి జాబిలి,ఆ జాబిలిలో ఓ బృందావనం.అందులో రాధామాధవుల ప్రణయ ప్రతిమ.ఎక్కడ చూసిన వెన్నెల వెలుగులు.పక్కనే పారుతున్న సెలయేటి గలగలలు,రంగు రంగుల పుష్పాలు,చిన్నగా చెవులను తాకే సుస్వరాలు ఇలా చాలా, మా ఇద్దరి కోసమె సృష్టించబడ్డ ఓ స్వర్గం లా వుంది.

   తను నన్ను మల్లెల బాటపై నడిపిస్తూ ఆ రాధమాదవుల ముందరనె వున్న  నందివర్ధనములతో పేర్చి వున్న ఓ పట్టు పరుపు పై కూర్చొబెట్టి తన వడిలో నా తలనుంచి నా నుదురును నిమురుతూ మనసుతో గుసగుసలాడుతూ "ఇప్పుడు చెప్పు ప్రియా! నీతో అ ఏడు అడుగులు వేయడానికి ఎవ్వరు లేరా?" అని..
మరి నువ్వు ఎక్కడి నుండి వచ్చావు,నిజము గా నా వెంటనే వుంటావా?నాతో కలిసి నడుస్తావా? అని నేను అడుగబోతున్నాను, ఇంతలో...

నా వీపుపై బాగా గట్టిగా రెండు దెబ్బలు పడ్డాయి.ఎవ్వరు అని కల్లు తెరచి చూస్తే బారెడు పొద్దెక్కినా మొద్దు నిద్ర,పగటి కలలు ఏంట్రా అని తిడుతు అమ్మ...లేచి చూస్తే ఇదంతా ఓ తియ్యని స్వప్నం..

    ఎప్పటిలాగె ఈ జగం చీకటి పడింది అని.కాంతులను విరజిమ్మె రవి కిరణుడు కూడా మెల్లగ తప్పుకొని తన వంటిపై నలుపు ని పులుముకొని తన వెంట దాక్కొని వున్న రాత్రిని కోటి ఆశలతో కంటున్న మన వెన్నెల కలలకు వెలుగును నింపడానికి కాస్త కాలం కనుమరుగయ్యాడని ,మెల్లగా నా కంటి రెప్పలు వెనక చీకటి కనపడ సాగి నాకు తెలియకిండా నేను నిద్రలోకి జారిపొయాను అని,తోడులేని ఒంటరి జీవితపు శూన్యపు నీడల్లొ కాలం గడపాలని తెలిసి కూడా నిదురపోతున్నానని,ఈ శూన్యపు జాడల్లో కూడా కనపడని వెలుగు కోసం,ఓదార్చే వడికోసం ఓ చిన్నపాటి కన్నీటి హృదయంతో మది తచ్చాడుతూ వుంది అని తెలిసింది.ఇదంతా రాత్రి,నిద్ర ఆడిన వింత నాటకం అని గుర్తొచ్హి ఓ తియ్యని నవ్వు నవ్వుకోని నా స్వప్న సుందరికై అన్వేషణ సాగించనారంబించా తనకై పరుగులు సాగించా...
ఇది ఓ అమ్మ-స్వప్నం-అన్వేషణ కథ.
రచన
మీ చక్రధర్


Wednesday, November 10, 2010

ఆ సొగసు చూడ తరమా?..

 
                                          చీర కట్టే పడతి వెలుగుల జగతి..
                                          చీర కట్టే ఇంతి సంస్కృతి ప్రగతి..
                                          చీర కట్టే యువతి వయ్యారముల కాంతి..
                                          చీర కట్టే చిన్నది తీపి స్వప్నముల నిధి
                                          చీర కట్టే బామ సింగారముల సీమ...
                                          చీర కట్టే లలన వెండి కుంకుమ బరిణే..
                                          చీర కట్టే మగువ పరువపు పొంగుల వెల్లువ..
                                          చీర కట్టే అమ్మాయి సరిగమల సన్నాయి..
                                          చీర కట్టే ఆమె రత్నముల ప్రతిమె..
                                          చీర కట్టే కాంత సంకురాత్రి ముగ్గంత..

                                          చీర సొగసు పొగడ ఆ శంకరుని తరమా?

Tuesday, November 9, 2010

నటనో లేక దైవ ఘటనో..


ఓ హృదయం కిటికి మాటున నిలబడి ఆకాశం వైపు ఆశగా ఎదురుచూస్తోంది ఎన్నటికైనా తిరిగి వస్తుంది తన నేస్తం అని..
లిప్త పాటున గుండె లయతప్పే తన సుమధుర దరహాసాం విని..
మనసు పొరల చాటున వున్న ఆశలకు రెక్కలొచ్చి ఆవిరై అనంతం వైపు పరుగులు తీసాయి..
మది చాటున ప్రేమాంకురం మొలకెత్తి మరువలేని ఓ ప్రేమకదనాన్ని నడిపించెను..
అలవాటున వేల సార్లు వెతికి చూసెను ఎదలోతున..
విది కాటున కలలన్ని సాగరంలోని తిరిగి రాని తరంగమల్లె మిగిలిపొయయి..
పొరపాటున బతికానని మరణం ప్రతి నిముషం వెక్కిరించే..
ఈ ప్రేమ బాటన సాగలేక,ఆగలేక,ఎటుతోచక కంటనీరు కారుస్తు మిగిలిపోయను ..
మరో మారున తిరిగి రాదని చేదు నిజాన్ని జీర్నించుకోలెక జీవోచ్చమయ్యెను ..
ఈ ఎడబాటున క్షణం ఓ యుగం గా తీపిలేని జీవితాని గడుప సాగెను..

ఇది ఆమె నటనో లేక దైవ  ఘటనో  తెలెయలేక రోదిస్తూ కాలాన్ని సాగదీసెను ..

Monday, November 8, 2010

ఎదురుచూస్తూ వుంటా..


చల్లని చిరుగాలిలో పయనం చేస్తుంటే మది నిండా నీ కమనీయమైన రూపం..
కాని నువ్వు చెంత లేవని కళ్ళ నిండా కన్నీరు.
రెప్పపాటు కాలమైన కూడా నిను మరవనివ్వని నీ చిరునవ్వు..
పోని నిదురైన నిను దూరం చేస్తుంది అంటే అక్కడ కూడా నీవే కలవై పలకరింపు..
పోని నీకు దూరము గా సుదీర తీరాలు చేరుకొందాము అనుకొంటే నీ ఆలొచనల దరి దాటనీయవు..
ఈ ఎడబాటును ఎద చాటు నుండి నీ చిలిపి అల్లరి చిత్రమైన సైగలు మరింత విరహాన్ని రేపు తున్నాయి
ఈ నిశ్శబ్ద నిశీధిలో నీ మౌన వీచికలు న మూగ మనసును మరింత మీటుతున్నాయ్..
ప్రతి క్షణం నీ ధ్యాసతో,నీ ఊసులతొ.. నాలో నువ్వు, నాకై నువ్వు,నువ్వే నేనుగా బతికేస్తున్నా...

ఇంతటి బాధను కాలకూఠ విషంలా బరిస్తున్నా నీ మనసు కరగదా,నాపై జాలి రాదా...
నీవెప్పటికైన తిరిగి వస్తావని నీకై ఒంటరిగా ఎదురుచూస్తూ వుంటా..

Sunday, November 7, 2010

మన ప్రేమకు సాక్షి ..



అమ్మ సాక్షిగా నేను అనంతంలో కలిసిపొయే వరకు నిను ప్రేమిస్తూనే ఉంటా..
దేవుడి సాక్షిగా నా దేవత నీవేనని నిత్యము నిను పూజిస్తూనే ఉంటా..
గుండె సాక్షిగా ఆఖరి శ్వాస వరకు నిను నిత్యం తలుస్తూనే ఉంటా..
మనసు సాక్షిగా నీ మాటలకై మౌన మునిలా నిత్యం తపస్సు చేస్తూనే ఉంటా..
కనుల సాక్షిగా సృష్ఠి అంతం వరకు నీ కలలను కంటూనే ఉంటా..
జీవితం సాక్షిగా ప్రతి జన్మ నిను వెంటాడుతునే ఉంటా...

నా సాక్షిగా ..
                 ఒక్క అడుగు నా వెనుక వేశావంటే నా ప్రాణం నీకిస్తా,నా రక్తంతో మన ప్రేమ కావ్యాన్ని రచిస్తా,నా గుండెను చీల్చి నీకు ప్రేమను పంచుతా,నా శ్వాసతో నీకు రక్షణ కవచం కలిగిస్తా..నిరంతరం మన ప్రేమ గీతాన్నె ఆలపిస్తా..

ఓసారి నా చేయి అందుకోవా ప్రియా!..

Wednesday, November 3, 2010

వచ్చిందోయ్ వచ్చింది..



వచ్చిందోయ్ వచ్చింది దీపావళి పండుగ వచ్చింది..
తెచ్చిందోయ్ తెచ్చింది అజ్ఞానాన్ని రూపుమాపే కాంతులని..
ఇచ్చిందోయ్ ఇచ్చింది మనుష్య జాతిలొని నరకాసురులని చంపే శక్తిని..
చెప్పిందోయ్ చెప్పింది ప్రతి ఒక్కరిలో ఓ సత్యభామ బయలుదేరాలని..
రక్షించిందోయ్ రక్షించింది ప్రజలందరిని చెడు బారినుండి..
చేసిందోయ్ చేసింది శ్రీకృష్ణుని అవతార కార్యాన్ని గుర్తుకి..
కలిపిందోయ్ కలిపింది అన్ని మతాలని ఒకే పండుగకి..
లేపిందోయ్ లేపింది అందరిలో నిద్రపోతున్న మంచితనాన్ని..
నింపిందోయ్ నింపింది అందరి ఇంట డబ్బుల మూటలని..
అనిందోయ్ అనింది ప్రజలంతా శాంతి సౌఖ్యాలతో కళకళలాడాలని..

నచ్చిందోయ్ నచ్చింది పిల్ల,పెద్దలకు పటాకులతో ఆటలన్ని..

"మీ అందరికి దీపావళి శుభాకాంక్షలు..." 
                                                -మీ ఛక్రధర్
"సర్వేజనా సుఖినోభవంతు!.."



నీకై తడిసిన కంటితో..


 
కళ్ళ ముందు కలవై తిరుగుతున్న కలుసుకోలేకున్నా..
తిరిగిరావన్న నిజం నాతో వున్నా గమ్యం మార్చుకోలెకున్నా..
మాయచేసి మోసగించినా నిన్ను మరచిపొలేకున్నా..
ప్రేమ మిగిల్చిన చేదు చరిత్రను కన్నీటి కావ్యంలా రచిస్తునా..
నీ ఎడబాటుతో మోడుబారిన మనిషల్లే బతికేస్తున్నా..
గుండెను గాయం చేసినా నవ్వుకొంటూ ఆనందంగా బరిస్తున్నా..
నీ నవ్వు,మాట,నీ రాక మాయ అని తెలిసి సహించలెకున్నా..
కనుమరుగయ్యావని తెలిసి కన్నీరు కారుస్తూన్నా..
నువ్వు కాదన్నా నీ రాకకొసం గుమ్మం వైపు ఎదురుచూస్తున్నా.. 
వెంటరాని మరణం వెంట పరుగులు తీస్తున్న..

తెలిసి ఇన్ని తప్పులు చేస్తున్నా అడగవేం ఒక్కసారైన..

Tuesday, November 2, 2010

నీవెవరివో?




                                      తీపి జ్ఞాపకాల చిరస్మరణీయతవో,
                                      ఎద మరుగున దాగున్న మౌనానివో,
                                      కవి భావనలకు కల్పనవో,
                                      హ్రుదయ తలుపులు తట్టే ఆకాశవాణివో,
                                      చిలిపి చిత్రాలు చేసె చైత్రానివో,
                                      గుండె గోపురానికి ప్రేమ గంటవో,
                                      అలై పోంగే సాగరానివో,
                                      మమతల మల్లికల సుమమాల అల్లికవో,
                                      నడిసంద్రంపై నడిచే నావవో,
                                      దివిసీమలో వెలిగే శ్రావణ జ్యొతివో,
                                      వెండి వెన్నెలలోని పాలరేకువో,
                                      చీకటి మోసుకొస్తున్న మంచు తెరవో
                                      రవి కిరణుడిలోని బంగారు తీగవో,

                                    తొలి సంధ్యవో,కరి మబ్బువో,సిరిజోతవో,విరిబోణివో..
                                             ఎవరివో?ఇంతకు నీవెవరివో?

నేనెవరు?



నా గమ్యాన నేను నడిచి వెళుతుంటే నడిచొచ్చే దేవతలా కనిపించావ్..
నీ చూపుల వశీకరణంతో నీ వెంటే తీసుకెళ్ళిపోయావ్..
నాలో నువ్వు చేరిపొయావ్,నేనె నీవు గా మారిపోయావ్..
నీ ఆలోచనలతో నా అన్న వాళ్ళు లేకుండా చేశావ్..
ఏ దారి లేని ఎడారిలో నన్ను నిర్దాక్షిణ్యం గా ఇలా పడేసి వెళ్ళిపోయావ్...
నా చుట్టూ శూన్యపు చీకట్లు,నీ ఆలొచనల సుడిగాలులు..కీకారణ్యం లా ఒంటరితనం, గుండే పగిలి వచ్చే కన్నీరు..నిర్జీవమైన దేహం,నిరాశతో మొద్దుపడిన జీవితం..చేప్పలేని బాధ,తట్టుకోలేని వ్యధ
దగ్గరకు తీయని మరణం..ఇది నా దీన స్థితి.
ఎందుకు నాకీ శాపం?

ఇప్పుడు నేనెవరు?నాలో ఎవరు?నాకు ఎవరు?

Monday, November 1, 2010

నీకై పోరాటం..



హ్రుదయ కుహరాలు తెరచి ఆశల తోరణాలు కడతావా చెప్పు పరుగెత్తుకొచ్చి ప్రాణం ఇస్తా..

ప్రేమ దీపమై ప్రాణానికి వెలుగును ఇస్తావా చెప్పు చిమ్మ చీకటిని చీల్చుకొని నడక సాగిస్తా..

చిన్ని నవ్వుతో మనసు పొరలపై నర్తిస్తావా చెప్పు చిరంజీవిగ బతికేస్తా..

ఓరచూపుతో కరుణిస్తావ చెప్పు లావాలా పెల్లుబికి ప్రపంచంతో పొరాడుతా..

వెన్నెల రాత్రి కన్న వన్నెల కలలను నిజం చేస్తవా చెప్పు జీవితాన్ని అంకితమిస్తా..

మాటల మంత్రంతో ముగ్దున్ని చేస్తావా చెప్పు మరుక్షణమే మరణాన్నైన జయిస్తా..

నీ తోడు కావాలి..



శూన్యపు పొరలు చుట్టేసినపుడు జాబిలి వెలుగులు పంచే ఓ తోడు కావలి..

మౌన వీదుల్లో తిరుగులాడేటప్పుడు ఆనందాన్ని ఇచ్చేటందుకు ఓ స్నేహం కావాలి..

సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతుంతే వెనుక నిలబడి నేనున్నా అని బరొసా ఇచ్చే నేస్తం కావాలి..

జీవిత ఒడిదుదుకులతో అలసిపొయినప్పుడు గతంలో గడిచిన ఓ మధుర స్వప్నం కావాలి..

వృద్దాప్యపు చాయలతో ఒంటరివై నిలచినపుడు నీడలా వచ్చే ఒక జ్ఞాపకం కావాలి..

Thursday, October 28, 2010

తుర్రుమనే జీవితం..


మానవుని జీవిత చక్రం జననం నుండి మరణం దాక...
 చిరుచిరు నవ్వుల జననం,కలకల లాడే తరుణం..
గలగల లాడే బాల్యం,తికమక పెట్టే పుస్తక పఠనం..
త్వరత్వర గా వచ్చే యవ్వనం,జిగజిగ లాడే  స్వప్నం..
మిసమిస చూపుల అమ్మాయిలు,గుసగుస లాడే మనసులు..
నకనక లాడే పొట్ట కోసం,చకచక పరుగుల ఉద్యోగం ..
గజిబిజి బతుకుల గమ్యం,రాజి రాజి ల పోరాటం..
రకరకాల మనుష్యులు, కలకలాలు రేపె ప్రేమలు..
తళతళలాడే వివాహ సంకెళ్ళు,పెరపెర లాడే రాయబారాలు..
మిలమిల
లాడే దూరపుకొండల సంసారం,కోరికోరి సమస్యల వలయం..
టకటక నడిచే కాలమానం,బిరబిర మీదకొచ్చే బాల్య వృద్ధాప్యం..
పకపక నవ్వే మృత్యు విలాసం,గోరి గోరి తీస్కెల్లే మరణం..

ఇదే జల జల రాలే జీవితం.. చరచర చినిగే కాగితం.. 

ఇదే యుగయుగాల ఆరాటం..జగజగాల కధనం..తరతరాల పయనం..

Wednesday, October 27, 2010

నా నవ్వుల మహారాణి!..


ఆమె నవ్వులు..
                                నా ప్రేమకు నడక నేర్పె నవతరంగాలు...
                                పరిమళాలు వెదజల్లే గులాభి పువ్వులు...
                                వేయి వసంతాల కొయిల రాగాలు...
                                ఊపిరాడనివ్వని జడివానలు...
                                మంచు పూల గిలిగింతలు...

                                ముగ్దమనోహర సుమబాలలు..
                                సరిగమల గుసగుసలు...

                                సంధించిన భాణాలు...
                                ఎద లొతుల్లొ భుపాల రాగాలు..
                                కనుల ముందు తిరిగే కలల సుడిగాలులు..
                                ప్రాణాన్ని తట్టి లేపె సిరిమువ్వలు..
                                హ్రుదయాంతరాలకు ఆశా జ్యొతులు...
                                మదికి మోహనాల ఆవరణలు..
                                

                                నా బ్రతుకునకె నూతన ఆవిష్కరణలు..
                                నా ఈ కవితా ప్రపంచానికి ప్రేరణలు..
                                నా ఈ కొత్త జీవితానికి ప్రారంబాలు,ప్రాంగణాలు..

Tuesday, October 26, 2010

నువ్వు నువ్వు నువ్వే!..



                        కరుణించే కంఠస్వరం నీవైతే  
                                                  గర్వించే గుండే నేనవుతా...
                        వర్షించే మేఘము నీవైతే 
                                                  సప్తవర్ణాల హరివిల్లు నేనవుతా..
                        వెసే ప్రతి అడుగు నీవైతే 

                                                  పులకించే ప్రతి స్పందన నేనవుతా..
                        మెరిసే తారక నీవైతే 
                                                  పరచే ఆకాశం నేనవుతా..
                        ఎద చిత్రించే కలల కుంచె నీవైతే 
                                                  మది ఫలకంపై ఆశల రంగునవుతా..
                        ఏ కాంతిలేని ఏకాంతంలోకి పడవేస్తే 
                                                  నీకు వెలుగునిచ్చే మినుగురు నవుతా..
                        వరములిచ్చే ప్రేమ దేవతవి నీవైతే 
                                                  ఆరాదించే అర్చకుడిని నేనవుతా..
                        హృదయ వేదికపై నర్తించే మయూరం నీవైతే 
                                                  నీ చిన్ని శిఖి పింఛము నేనవుతా..
                        నీ అంతరంగంలో ఆగ్రహం ఎగిసితే 
                                                  చల్లార్చే హిమ సైకతాన్నవుతా..
                        మాటలేని మౌనమయ్యావంటే 
                                                  నిన్ను మురిపించి మరపించే మొహన రాగమవుతా..

            నీవు అనుగ్రహిస్తే నీ జతనవుతా,కలనవుతా,నిన్ను కాపాడే ముత్యపు చిప్పనవుతా,ఓ మరచిపోని కథనవుతా... 

ఎందుకంటే నాలో నువ్వు..నాకై నువ్వు..నేనె నువ్వు...

Monday, October 25, 2010

రంగుల హరివిల్లు ఈ జీవితం..

 
నేనున్నానని ముందుకు నడిపించే తోడుంటే అన్ని ముళ్ళదారులు కూడా రహదారులే..


నమ్మకం నిజమైనపుడు నిశ్శబ్దం లో కూడా మొహన రాగం వినిపిస్తుంది..అదె నమ్మకానికి చిల్లు పడ్డపుడు నీ వెంట నడిచే నీడ కూడా ఎవరు నీవు అని వెక్కిరిస్తుంది..


మన యవ్వనం ఊరించే ఊహల ఉయ్యాల!.డోలలూగే మనసు పరుగులు తీసె హరిణమే..కదా..ఇది గాలిపటం లాంటిది..ఏప్పుడు ఏగరాలో నిలబడాలో తెలుసుకొంటే బ్రతుకికి సరి అయిన లయ,శృతి.


నే కన్న తీపి కలల్ని,నా గుండె బారల్ని ఓ హంసలేఖ రాసి పంపుతున్న..ఆదరించి అభిమానిస్తావో ఆగ్రహించి చీత్కరిస్తావో..ఏదైన సరే నీ నీ నోటిమాట నన్ను చేరనీ ప్రియా...


కన్న కలలు నడుస్తున్న జీవితం ఒకటైతే ప్రతి రోజు ఒక ఆనందాల నందన హరివిల్లు...
నిజమైనది ఏదురైనది వేర్వేరు ఇతే ప్రతి క్షణం,ప్రతి రాగం విషాద గీతం..


ప్రేమించే నీవు తోడుంటే శూన్యం చుట్టేసిన భయం లేదు,దిగులు లేదు ఆందోళన అసలె లేదు..అలసట ఎరుగక నీ చూపులతో,కలలతో తియ్యగా బతికేస్తా..

నీవు పక్కనవుంటే ప్రపంచం చివరి అంచుల వరకు నడవగలనని నమ్మకం..నీవు మరుగైన మరుక్షణం నేనెవరో నాకే అగమ్యగోచరం...

మంచు పొరలను చీలుస్తూ తొలిసంధ్యా వెలిగినట్టు..నీ ఆలోచనలలో వణుకు లేనంత వరకు కాలమానం గిర్రున తిరిగినా ప్రతిరోజు నిత్య యవ్వనమే ఆ కాలానికి...ఆరిపోని సంకల్పం వున్నంతవరకు ప్రతి అడుగునా విజయతోరాణాలే..

Sunday, October 24, 2010

కితకితలు-2



బరక్ ఒబామ అదిరిపడేది ఎప్పుడు?
ఇంగ్లీష్ చాన్నల్స్ లో కూడా మన తెలుగు సీరియల్స్ వచ్చినప్పుడు.

షాప్ ఓనర్ అదిరిపడేది ఎప్పుడు?
వెయ్యి రూపాయలకు ఏమి తీసుకొన్న ఓ చీర ఫ్రీ అంటే,వెయ్యి కి చిల్లర తీసుకొని చీర ఫ్రీ అడిగినప్పుడు.

రమేష్:స్వామి నా పరిస్తితి ఏమి బాగోలెదు.నా జాతకం చూసి చెప్పండి.
జ్యోతిష్కుడు:నీకు శని నీచం నాయనా.సంతాన బాగ్యం లేదు.
రమేష్:అదెలా స్వామి!నాకు ఇద్దరు పిల్లలు.
జ్యోతిష్కుడు:పిచ్చివాడా నీకు లేకుంటే ఏం.నీ బార్య కు వుంది గా.

రమేష్:నువ్వు మీ ఆవిడా,మీ అమ్మ గొడవ పడితే ఏంచెస్తావ్ రా?
సురేష్:నేను చాలా తెలివైన వాడిని మంచం కింద దాక్కొంట.

రమేష్:లతా నువ్వు లేని నా జీవితం సూన్యం.చచ్చిపొతా..
లత:అబ్బా ఎక్కడో టచ్ చేసావ్ రా.
రమేష్:అలా టచ్ చేసే అలవాటు మా వంశంలోనె లేదు.
లత:అయితే ఇక నువ్వెందుకు ఆ సురేష్,రాజేష్ చాల్లె.వాల్లతోనె కంటిన్యు అవుతా లవ్లో.

రమేష్:మామా నీ లవ్వర్ సూపర్ గా వుంది రా చీరలో ఈ రోజు..
సురేష్:అబ్బా అది తన ప్రతి మ్యారేజె డే కి ఇలాగే వుంటుంది లేరా.

లత:ఏమండి.రేపు మా నాన్న గారి తద్దినం.రండి వెళ్తాం.
రమేష్:పెళ్ళైన మొదటిరోజు నుండి నీతో తద్దినమే గా మల్లీ దానికెందుకు.(అన్నాడు గొనుగుతూ).

లత:ఏమండి.ఈ అన్నం తీస్కెల్లి పైన కాకి కి పెట్టిరండి.
రమేష్:మల్లీ కాకి కి ఎందుకే దండగ.ఇంట్లొ మీ నాన్న ఉన్నాడు గా పెట్టేసె.
లత:ఓహ్ అలాగా.ఆ భాగం ఎప్పుడో మీ అమ్మగారు తినేశారు గా.

రమేష్:నా బార్య మా అత్తగారింటికి వెళ్ళి నెల రోజులు అయ్యింది.కష్టం గా వుంది(అన్నాడు విరహం తో.)
సురేష్:నా బార్య వెళ్ళి 2 నెలలు అయ్యింది.నువ్వు కూడా మా ఇంటికి వచ్చె మా పక్కింటి ఆవిడది చాల పెద్ద మనసు.

రమేష్:స్వామి!నన్ను 7 ఏళ్ళుగా శని పీడుస్తుంది ఏం చేయను?(అన్నాడు బాధతో)
జ్యోతిష్కుడు:నన్ను నా బార్య 25 ఏళ్ళుగా పీడిస్తుంది.నేను ఎవరితో అయిన చెప్పుకొన్నానా.బార్య గ్రహం కంటే బలమైంది నాయనా జాగ్రత్త.

లత:నిన్న పనిమనిషిని వాటేసుకొన్నరంట.
రమేష్:నువ్వనుకోని పొరపాటున చేశా నే.
లత:నిజం చెప్పండి.అది అందంగా వుందని అలా చేసారు కదూ.
రమెష్:అబ్బ మన పెళ్ళి అయిన ఇన్ని రోజులకు నిజం ఒప్పుకొన్నావే.

లత:నిన్న పనిమనిషిని వాటేసుకొన్నరంట.
రమేష్:అవును.నీకెలా తెలుసు.
లత:నిన్న అది రాలేదు.మీరు వాటేసుకొన్నది మా అమ్మను.

సురేష్,వెర్రి వెంగళప్ప బట్టల షాప్ కి వెళ్ళారు.
సురేష్:హీరోయిన్స్ వేసే డ్రెస్సులు చాలా బాగుంటయి.ఇశ్వర్యా వేసిన జీరొ సైజ్ అయితే సూపర్.
వెర్రి వెంగళప్ప:అయితే నాకు 5 జీరొ సైజ్ ప్యాక్ చేయమని చెప్పు.
సురేష్:ఎందుకు రా సన్నాసి.
వెర్రి వెంగళప్ప:మా బామ్మతో కలిపి మా ఫ్యామిలి లో 5 మంది వుంటారు.

రమేష్:ఏమేవ్!నువ్వు ఎవరి పోలిక?
లత: ఏమోనండి తెలియదు అమ్మను అడగాలి.సుబ్బారావా ?అప్పరావా? ఎవరబ్బా?
రమేష్:చి.. చి.. అదేంటే.
లత:వాళ్ళు మా మేనమామలు లెండి.మీరు మీ వెధవ అనుమానాలునూ..

భర్త:మన కిట్టుగాడు అంతా నా పోలికే.నీదేం కాదు.తెలుసా.
బార్య:అవును అవును మీ పోలికే.(పిచ్చాడు పక్కింటి సుబ్బరావ్ పోలికని చెప్తే గుండె ఆగి చస్తాడు అనుకొంది మనసులో)

రమేష్ వాల్ల పనిమనిషి రమేష్ ని కౌగిలించుకొంటు దొరికిపొయింది.
పనిమనిషి:అమ్మ గారు క్షమించండి.
లత:పిచ్చి దాన అలాగ దొరికిపొతారా ఎవరయినా.మా ఆయన ఫ్రెండ్ సురేష్ తో ఎప్పుడైన ఇలా దొరికిపొయాన నేను..

లతా,తన 5 ఏళ్ళ కొడుకు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు.
లతా:పెళ్ళైన రోజు నుండి చూస్తున్న మా అయనను.రోజంత నిద్రపొతూనే వుంటాడు.ఈ జబ్బు ఎలా పొయేది డాక్టర్ గారు.
డాక్టర్:అవునా మరి మీకు కొడుకెలా??
లత:భలెవారే దానికి మా ఆయనే మెల్కొని వుండాలా ఏంటి?

Thursday, October 21, 2010

ఆహా!నా చెలి..


         ప్రియా!నీవు నేను ఏకమై ఏకాంతంలో వన్నెల వెన్నెల నీడలో,జాబిలి తొంగి చుస్తూ ఉంటే,నందవన కుసుమాల పరిమళములలో నీ అపురూపమైన రూపాన్ని చూస్తూ వుండిపొతే,
        ఆహా!అద్భుతం..

       నీ ఒడిలో తలవాల్చి కలువ కళ్ళను చూస్తూ వుంటే నీ మదుర అదర పూరేకులతొ నా చెవిలో గుసగుసలు చెబుతుంతే అవి చిన్న చిన్న అలలై నా ఎద తీరాన్ని తాకుతుంటే,

         ఆహా!అతిశయం..

        నీతో కలసి ఉయ్యాలలూగుతుంటే చల్లని పిల్లగాలి తాకిడికి ఎగిరిపడే నీ కురుల సిరులు నా మోముని అలా తాకుతూ వెళ్తూ ఉంటే,

         ఆహా!అమోఘం..

         నీవు మెల్లగా కొయిలవై కూనిరాగాలు తీస్తుంటే అవి నీ పెదవుల అంచుల నుండి జాలువారి మోహనమై నన్ను సమ్మోహన పరుస్తుంటే ఆ తాకిడికి నేను ఈ కొత్తలోకంలో మత్తెక్కి గమ్మత్తుగా కునుకు తీస్తుంటే,

          ఆహా!అనిర్వచనీయం..

         సొట్టపడ్డ నీ చెక్కిళ్ళు,గులాబి పూవ్వై ఎరుపెక్కి గుబాలించే నీ బుగ్గలను కరములతొ స్పర్సిస్తూ వుంటే,
         
          ఆహ!ఆనందహేళనం..

         నీ పట్టు వొంటిపై పరికిని తకదిమి చేస్తు జారి నాపై పడుతుంతే సిగ్గుతో నువ్వు నీ అందాలను దాచుటకు తర్జన భర్జన పడుతుంటే,
          ఆహ!ఆ అనుభవం..

     ఈ సుమధుర తరుణంలో కాలం ఇలాగే ఆగిపోయి ఈ సుఖక్షణాలు,ఈ తీపి జ్ఞాపకాలు,అనుభూతులు ఇలాగె నిలిచి పొయ్ ఇలగె కన్నుమూస్తే,
           ఆహా!అజరామరం..
         

Wednesday, October 20, 2010

నిన్నే తలిచా-నీవై తడిశా!..



నీకై అన్వేషిస్తూ పరుగులు తీస్తుంటే పువ్వులు పక్కున నవ్వె
ఈ ప్రేమాన్వేషికై జన్మించిన మరో పువ్వుకోసం పరితపిస్తున్నాడని..

నిన్నే అనుసరిస్తూ బువిపై అడుగులు వేస్తుంటే అది కోటి దీపపు కాంతులను చిమ్మె
ఈ ప్రేమబానుడు  నీ హ్రుదయ తెరలపై పాదముద్రలు వెస్తున్నడని..

నిన్నే కలవరిస్తూ కన్నీరు కారుస్తూ ఉంటే పాలసంద్రం పరవళ్ళు తొక్కె
ఈ ప్రేమ తపస్వి
నీకై  కంటున్న కలలు అలలై ఉవ్వెత్తున పొంగుతున్నాయని..

నిన్నే తలుస్తు కరిగిపోతుంటే హిమము తరిగి సలయేరై పారే
ఈ ప్రేమాభిమాని నిన్ను చేరె తరుణం త్వరపడినదని..

నీవే సర్వమై చలించి పోతుంటే ఆ చంద్రుడు చరితై చిత్రముగా చూసే
నా వన్నె చిన్నెల వయ్యరి కంటి వెలుగులు వెన్నల కన్నా చల్లనివై నన్ను కరుణించునని..

నీకై ప్రతిక్షనం మరణిస్తూ,పుడుతూ వుంటే ఆ అగ్నికి శక్తి చమ్మగిల్లె
ఈ ప్రేమనిరీక్షకుడిని దహించే విరహం మరొ బలమైన మంట అని..

నిన్నే స్మరిస్తూ ఎద సడులను గమనిస్తూ ఉంటే వీణ నాదాలు విస్తుపోయె..
నీకై స్వరించే నా విరహ గాన గీతికల స్వరాలు నీ ఆవరణలు అయ్యాయని..

నీకై తపిస్తూ ప్రేమ పరుస్తు ఉంటే ఆ శిల్పాలు తిరిగి శిలలు గా మారే..
ఆ శిలలపై ఏ శిల్పి నీలాంటి పాలరాతి బొమ్మని మలచలేదని..

అబ్బి గాడి ప్రేమ గోల:

వీడే మన అబ్బిగాడు:

వీడి పేరు జాన్ కీట్స్,
పిల్లను చూసి వెలిగాయి కళ్ళల్లో లైట్స్,
గుండెల్లో పేలాయి డైనమైట్స్,
ఎగిరై గాలిలో ఆశల కైట్స్,
తిన్నాడు కాఫి బైట్స్,
వేశాడు బ్రాండెడ్ టైట్స్,
ఎక్కాడు తనకోసం కనెక్టెడ్ ఫ్లైట్స్,
చేరాడు ప్రేమలో హైట్స్,
పాడాడు పిల్లతో డ్యూయెట్స్,
వచ్చాయి అమ్మాయి నాన్నకు వీడిపై డౌట్స్,
జరిగాయ్ పెద్ద పెద్ద ఫైట్స్,
తిసేశాడు మనవాడి జాయింట్స్,
బెడ్ పై ఎక్కించారు వీడి క్లాస్మేట్స్,
తొలిగాయి అజ్ణాన గేట్స్.
చదవడం స్టార్ట్ చేశాడు హ్యుమన్ రైట్స్.

అబ్బిగాడి ప్రేయసి పద్మావతి:

పద్దు పద్దు పద్దు..
నువ్వు పెద్ద మొద్దు..
కాని మీ అమ్మకు ముద్దు..
ఊరికి వద్దువు గాని బట్టలు సద్దు..
మా ఇంటికి మత్రం రావద్దు..
ఎందుకంటే నీ పిచ్చికి లేదు హద్దు..
నువ్వు మరీ బొద్దు..
పద్దు గుద్దావంటే ఓ గుద్దు..
వుండదు నాకు మరో పొద్దు..



అబ్బిగాడే పోకిరి విధ్యార్థి:

నేను పెద్ద బోక్,
నాకు కొంచం క్రాక్,
బాగ ఎక్కువ సోక్,
ప్యాంట్,షర్ట్ వేసి చేస్తా టక్,
తింటాను మైసూర్ పాక్,
కిలోల కిలోల మాంసం చీక్,
కావాలి అమ్మయిల లుక్,
వేస్తాను కుళ్ళు జోక్,

నాన్నా వీడిని ఓ పీకు పీక్,
లేకుంటే లైఫె అంతా జింతాక్ జింతాక్ జింతాక్ జింతాక్..

Tuesday, October 19, 2010

నీ స్నేహం..


                                        కష్టాలలో కంట నీరు తుడిచే కలిమి స్నేహం..
                                        గుండె గాయాన్ని మాయం చేసే మంత్రం స్నేహం..
                                        ఆపదలో ఆదుకొనే ఆపన్న హస్తం స్నేహం..

                                        తలపై యదనుంచి ఊరడించే ఓదార్పు స్నేహం..
                                        ఏ బంధం లేకుండా ఏర్పడిన అనుబంధం స్నేహం..
                                        ఒడిదుడుకుల ఒంటరి జీవితానికి అండ స్నేహం..
                                        తోడై,నీడై వెంట నడిచి వచ్చె బాస,బాసట స్నేహం..

                                        తుంటరి అల్లర్లకు,కొంటె పనులకు తోడు స్నేహం..
                                        తల్లడిల్లె హ్రుదయ వేదన తీర్చే తపన స్నేహం..
                                        యదసొదలను తీర్చె యంత్రం స్నేహం..

                                        బాదలు తీర్చి బతుకుకు బరోసా ఇచ్చేది స్నేహం..
                                        జీవిత ప్రయానం లో సేద తీర్చే సహబాటసారి స్నేహం..
                                        జీవిత నందనవనంలో కుసుమాల పరిమళం స్నేహం..

                                        ఆనంద రాగాల రంగుల హరివిల్లు స్నేహం..
                                        వర్షించే హ్రుదయం,కరుణించే తరుణం స్నేహం..
                                        ధరిత్రిపై వెలకట్టలేని ధనం స్నేహం..
                                        రెండు చేతుల కలయికతో చేసె చప్పట్ల చప్పుడు స్నేహం..

ప్రాణం అనే కలంలో ఊపిరి అనె ఇంకు పోసి రాసిన ఈ సువర్ణ పదాలన్ని నా ప్రాణ మిత్రులకు అంకితం..

Sunday, October 17, 2010

ఏకమైన మనసులు



ఏకమైన మనసుల ఏకాంతంలో ఏడారి అయినా వెన్నెల పూబాటలే..
మమతల మల్లికల అల్లికలలో నిశ్శబ్ద నీడలు కూడా మౌనరాగాల మాలికలే..

నీ ఊహల జాడలు, నీడల తోడులు లేనపుడు కంటికి కఠిన శూన్యం..
నీ మాటల గుసగుసలు,అడుగుల సడులు వినగనె బతుకు నిత్య నెమలి నృత్యం..

నీవు అడుగు వేసిన ప్రతి అణువు అరుణ భాసురం,కిరణ కింకరం..
నీ జాడలేని జీవితాన విరహ వీచికలు,మ్రుత్యుఘోషలు..

నీ జతన జీవితానికి పున్నమి వెలుగులు,బంగారు పానుపులు..
నీవు మరుగైన మరుక్షణం చిమ్మ చీకట్లు, గుండెకు గులాబి ముల్లులు..

నీ వన్నెల సోయగాల వడగాలులు తాకిన మేనికి వెన్నెల వెలుగుల మల్లెల పందిరి..
నీ కలలు లేని నిద్రలు,తోడులేని రేయిలతో వంటిపై  ముళ్ళ కిరీటాలు..
 

Wednesday, October 13, 2010

నీకై నిరీక్షణ..


                                      కాలమానం కోడెనాగై కాటేస్తూ ఉంటే,
                                      గతించిన కాలం గుణపాలై గ్రుచ్చుతు ఉంటే,
                                      ఒడిదుడుకుల వర్తమానం ఓడిస్తూ ఉంటే,
                                      బలమైన విధి బలిచేస్తాను అని భవిష్యత్తుని భయపెడుతుంటే,
                                     బరువైన బ్రతుకుతో,

                        అడుగులో అడుగు వేసి వెంట నడిచే తోడు కోసం, తల వాల్చేటందుకు ఎద కోసం, ఓదార్చేటందుకు ఒడికొసం ఓంటరినై రెప్ప వాల్చకుండా మూసి ఉన్న తలుపులకేసి నీ తలపులతో ఎదురుచూస్తున్న ప్రియా!..

Tuesday, October 12, 2010

విరించినై విరచించితిని


                           ఊహలతో ఊరించి..ఊసులతో మురిపించి..నవ్వులతో మరిపించి..మనసుతో స్ప్రుశించి..నాచే ప్రేమ కావ్యాలను రచించి..కళ్ళతో పిలిపించి..మౌనాన్ని కరిగించి..ప్రాణాన్ని పలికించి..కౌగిలితో బందించి..సుఖాలలో నన్ను ఉంచి..మంచిని మించి ప్రేమను పంచి..నాకై చలించి..నన్నె బరించి..నా మనసును గాంచి..అమ్మను తలపించి..ప్రేమకై విలపించి..గుండెల్లో ప్రేమై జ్వలించి..కాస్తున్న విరహాని దహించి..నాకై తపించి..నన్నె జపించి..పరవశించి..ఆనందంలో రమించి..నాతో జతించి..అందరిని వారించి..నన్నె వరించి..ఎల్లలు దాటించి..నా ప్రేమను గెలిపించి..నాకై ఈ బువిలొ జన్మించి..నా ఈ జన్మను తరింప చేసిన నా ప్రేయసికి ఆగమాల మాలలతో సుగమాల స్వాగతాలు..


Thursday, October 7, 2010

కన్నె కలువ కాంత!..



                    తేనె మదువులోని తియ్యదనం తాను..అనురాగంలో మాధుర్యం తాను..

                    గుండె గూటిలో గోరింక తాను..చిలక పలుకుల చెంచిత తాను..
 
                    తాంబూలం ఇచ్చె ఎర్రదనం తాను..ప్రకృతిలోని పచ్చదనం తాను..

                    మరపించే మైత్రి తాను..మురిపించే ముచ్చట తాను..

                    ప్రేమ ఇచ్చే మెత్తని మత్తు తాను..గుండె గుబులు చేసె గమ్మత్తు తాను..

                    సూర్య కాంతి పడ్డ కలువ తాను..సత్యభామ శమంతకమని తాను..

                    అందం చసె అల్లరి తాన్ను..బంధం వేసే బాట తాను..

                    గంధంలో సుగంధం తాను..గానంలో గాంభీర్యం తాను..

                    తాతయ్య నోట చక్కటి కథ తాను..కవి చేత కలం తాను..

                    ప్రేమదేశపు యువరాణి తాను..రాజదర్భారులోని వజ్రాల నిధి తాను..

                    నవనీత చోరుని నెమలి పింఛం తాను..నటరాజు పాదపద్మం తాను..

                                              ---ఆవిడే ఈ కన్నె కలువ కాంత!..

Tuesday, October 5, 2010

చింటు- పింటుల ప్రేమ కథ


మొదట ఉన్నది అమ్మాయి చింటు.పక్కన ఉండేది దాని ఫ్రెండ్ పింటు.ఇద్దరు పక్క పక్క ఇళ్ళలోనె ఉంటారు.కలిసి ఆడుకొంటూ.కలిసి స్కూల్ కి పోయెవారు.

ఇద్దరి మద్య స్నేహం బాగా పెరిగింది.కాని మన పింటు గాడు మాత్రం ప్రేమ లో పడిపోయాడు.

ఎప్పుడు చెబుతామ,ఎలా ఇంప్రెస్ చేస్తామా చింటు ను అని అలోచిస్తూ జీరొ క్లాస్ నుండి 2వ క్లాస్ దాకా కాలాన్ని గడిపాడు.చివరకు 3వ క్లాస్ లో తెగించి తన ప్రేమను ఇలా చెప్పేశాడు మన "మగధీర" సాంగ్ తో.

పింటు:పెన్సిల్ నిన్ను తాకింది..ఏరేసర్ నిన్ను తాకింది.. నేను నిన్ను తాకితే తప్పా?
చింటు:పెన్సిల్ రాయనిచ్చింది..ఏరేసర్ తుడపనిచ్చింది..వాటితో పోలిక నీకేల?
పింటు:అవి 5థ్ క్లాస్ వరకే తోడుంటాయమ్మ..నేను 10థ్ క్లాస్స్ వరకు తోడొస్తానమ్మ..

అయినా చింటు ఒప్పుకోలేదు..మన పింటు స్కూల్ మానేసి ట్యూషన్ క్లాస్ లు ఇలా చెప్తూ బతికేసాడు..
చిట్టి చిలకమ్మ..
లవ్వర్ తిట్టిందా..
బార్ కి వెల్లావా..
బీరు తాగావా..
కిక్కు ఎక్కిందా..
కింద పడ్డావా..
పళ్ళు రాలాయా..
తిక్క కుదిరిందా..

చింటు:తెలుగులో నాకు నచ్చని పదం ప్రేమ.
పింటు:ఏ బాషలో అయిన నాకు నచ్చని పదం చింటు.

తలచినదే జరిగినదా దైవం ఎందులకు...

Monday, October 4, 2010

మా తెలుగు తల్లికి మల్లెపూదండ!.

 



                            

సృష్టి తల్లికి,జగత్తు తండ్రికి పుట్టిన ముద్దుల బిడ్డ తాను..
భరతమాత సిగలో బంగారు పువ్వు తాను..

పుడమి తల్లిపై ప్రతిధ్వనించే పలకరింపు తాను..
పుడమి తల్లిని పలకరించే ప్రతిధ్వని తాను..

నిశ్శబ్దాల చీకటిలో గళ్ళుమనే కాంతి కిరణ కంఠం తాను..
ఉప్పొంగే కవి హ్రుదయ భావాలకు పట్టము తాను..

జాతి సంస్కృతికి,సంస్కారాలకు జనని తాను..
నిదిరిస్తున్న జనాన్ని తట్టిలేపె సూక్తి ముక్తావళి తాను..

చరిత్ర పుటలకు,పురాణ స్మృతలకు గట్టి అధారం తాను..
గతించిన కాలాన్ని లిఖించి చెప్పే అనుభవసారం తాను..

తెలుగు వెలుగుల జాతి గౌరవానికి,గర్వానికి నిలువెత్తు ఆభరణం తాను.. 
యుగయుగాల మన కీర్తి ప్రతిష్ఠలకు పచ్చల కిరీటం తాను..

మానవాళికి మమతానురాగాలు పంచే మాట తాను..
పులకింప చేసే ప్రకృతిని చెప్పే పంచామృత ధార తాను..

తరతరాలుగా నిలిచి ఉన్న బంధాలకు అనుసంధానం తాను..
ఆరాదించి స్వాగతమిచ్చే మహరాజుల ఇంట పెద్దపీట తాను..

ఎత్తైన శిఖరంలా పొగడ్త తాను..హిమాలయంలా చల్లని హిమం తాను..

ఈ సృష్టికే తీపి తాను,ప్రతి తెలుగోనికి తల్లి తాను..

శిశువు నుండి వృద్దుని దాక మాటతో నడిపించే రహదారి తాను..
అచ్చమైన ఆంధ్రుడి దశ తాను,దిశ తాను..

ఆమె మన ముద్దుల చక్కనమ్మ,చుక్కలమ్మ,అంధ్రుని అమ్మ మన తెలుగు తల్లి.

తెలుగులోనే మాట్లాడతాం,తెలుగుని కాపాడతాం.దేష భాషలందు తెలుగు లెస్స అని మరోసారి చాటి చెబుతాం.

జై తెలుగు తల్లి,జై జై తెలుగు తల్లి.


Thursday, September 30, 2010

ఆమెతోనె నా ఏడు అడుగులు


ఆమెను చూస్తే కంటికి వెలుగు రావాలి,ఊహలకు ఊపిరి కలగాలి,ఊపిరికి వేగం పెరగాలి,

ఆశల రెక్కలు విచ్చుకోవాలి,కలలకు ఆకారాం రావలి,ఆ నిముషం స్వర్గం అవ్వాలి,


తన వెన్నెల చూపుల వెలుగులకు యదలో అలికిడి కలగాలి,


తను నడిచొస్తుంటే హ్రుదయ తలుపుల్లో అలజడి రేగాలి,

తన కాలి అందెల సవ్వడికి ప్రక్రుతి పరవసించాలి,

తన మేని పరిమలాలు అత్తరులై ఆకాశాన్ని అంటాలి,

ఆమె స్పర్శతో గుండె లోతుల్లో పవనాలు వీచాలి,

తన కౌగిలితో కంటినీరు ఉప్పెనై ఉబకాలి,

గుండె గుడిలో తన రూపం శాశ్వితంగ నిలిచిపోవాలి,

తననవ్వులు జన్మ జన్మలకు పువ్వులై వర్షించాలి,

పెదవి అంచుల్లొ ప్రతిక్షణం పరితపించె నా పేరె వినపడాలి,

ఆమెతో వేసె 7 అడుగులు 7 జన్మలు గుర్తుకు రావాలి,

తన మాటల గలగల లతో నన్ను నేను మైమరచిపోవాలి,

మెల్లగ ఆమె అడుగుల్లొ అడుగు వెస్తు ప్రపంచాన్ని మరవాలి,

చిగురించె నా చిరు చిరు ఆశలు తన హ్రుదయంతో చిలకాలి,

నా చిటికెన వేలు పట్టుకోని పెళ్ళిబందానికి ప్రాణం పొయాలి,

ఆనందపు అందాలు,అల్లర్లు తన సౌందర్యమైన మోములో కనపడాలి,

విరహయాతనతో నోట మాట రాకుంటే కంటి బాషతో మనసు వెదనంతా తెలుసుకోవాలి,

ప్రతిరోజు ఓ ప్రెమికుల రోజు అయ్ ఇరువురి ఊపిరి గాలిలో ఏకమైపోవాలి..


Sunday, September 26, 2010

బంగారు తల్లి - నా ముద్దుల చెల్లి

                              ఇది గారాల నా చిట్టి చెల్లెలు..
                                      తాకితే కంది పోవును దాని పాల బుగ్గలు..
                                      దాని అందానికి సాటిరావు ఏ మల్లెలు..
                                      ఆటలకై పేర్చెను మరిన్ని గవ్వలు..

                                      తిరిగాం మెమిద్దరం పల్లెపల్లెలు..
                                      చూశాం రంగు రంగుల తిరునాళ్ళు..
                                      కొనిచ్చా దానికి బొలెడన్ని బొమ్మలు..

                                      అది కట్టెను అందమైన వెండి గజ్జెలు..
                                      మోగినవి అవి నా గుండెల్లొ గల్లు గల్లు..
                                      నాట్యమాడెను ఆ వెండి మబ్బులు..
                                      వెలవెల పోయెను ఆ సిరిసిరి మువ్వలు..

                                      తను లక్ష్మిదేవి అయ్యిందని పెట్టారు జడ కుచ్చులు..
                                      తనకోసమై తెచ్చా విరజాజుల,చేమంతుల పువ్వులు..
                                      మురిసిపోయాను చూసి తన నవ్వులు..
                                      ఈ పండుగకు చాలలా వేయి కన్నులు..

                                      నా చిట్టి తల్లి వయసుకు వచ్చెను రెక్కలు..
                                      అయ్యాయి ఓ సుగుణల రాకుమారునితో లగ్గాలు..
                                      తన బుగ్గలు వేసెను సిగ్గుల మొగ్గలు..

                                      పండెను ఈ అన్నయ్య తియ్యని కలలు..
                                      లేవు నా సంతొషానికి పగ్గాలు..
                                      ఈ రోజు కోసమె వెచా ఎన్నో రాత్రి పగల్లు..

                                      మొగించాము ఘనంగా పెళ్ళి బాజాలు..
                                      ఈ సంబరానికి చాలలా వేయి కన్నులు..
                                      తొంగిచూసెను ఈ సందండిని ఆ ముజ్జగాలు..

                                      తను నన్ను వదిలి వెళ్ళడానికి పెట్టెను గగ్గోలు..
                                      మొదలైంది నాకు పట్టరాని దిగులు..
                                      గుచ్చుకొన్నాయి ఈ చిన్ని గుండెకు ముళ్ళులు..
                                      పొంగిపొర్లాయి సెలయేరై కన్నీళ్ళు..

                                      ఏదైతేనేం ఇప్పుడు తను బాధ్యత గల ఓ ఇల్లాలు..
                                      వాళ్ళ ఇంట్లో ఓ బుడతడి గలగలలు
                                      ఇస్తున్నారు స్వర్గం నుండి నాన్నగారు ఆశీస్సులు..
                                      ఎక్కడున్న వుండాలి తను చల్లగా నిండు నూరేళ్ళు..

                    చెల్లెమ్మ నువ్వేక్కడున్న ఈ అన్నయ్య మనసు నీ వెంటే వుంటుంది,నీ క్షేమమే కొరుకుంటు    ఉంటుంది.నా బంగారు తల్లి ఈ అన్నయ్యను మరచి పొవు కదూ..