Monday, September 17, 2012

చిన్ననాటి నా మిత్రురాలు

చిన్ననాటి నా రెండో మిత్రురాలు ఫేస్ బుక్ లో దొరికిన శుభ సందర్భంగా..



చిన్ననాటి చెలిమైన ఓ జాబిలమ్మా..

ఇన్నాళ్ళు ఏ మబ్బుల వెనక దాగున్నావమ్మా?..

సప్త సముద్రాల ఆవల వున్న మల్లె పువ్వమ్మా..

నీ గురించి గుసగుసలాడాయిలే ఆ కొమ్మ రెమ్మ..

వెతికి పట్టాగా చివరికైనా నీ చిరునామా..

నా చిరస్మరనీయ స్నేహానికి చిత్రపటమా..

ఈవేల నవ్య రాగాల ఆనంద పరవశమా?..
నీవు నవ్వితే చాలు ముత్యాల వానమ్మ..

చీర కట్టులో నువ్వు ఓ కుందనపు బొమ్మ..

త్వరలో అవ్వాలి నువ్వు చక్కటి అమ్మ..

అదేగా అసలైన గొప్ప ఆడ జన్మ..

ఆనందంతో తుడవాలి నా కంటి చెమ్మ..

Sunday, September 16, 2012

చిన్ననాటి నా స్నేహం..

చిన్ననాటి నా మొదటి మిత్రురాలు ఫేస్ బుక్ లో దొరికిన శుభ సందర్భంగా..



స్నేహానికి మొదటి అర్థం నీవే,నా మొదటి స్నేహం నీవె..

బ్రతుకు పోరాటాన్ని నేర్పిన తొలి గురువు నీవే

నీతి శతకాలతో నడిపించిన మరో నాన్నవి నీవే..

ఆడించేటి,ఏడిపించేటి తొలకరి అల్లరి నీవే..

చేయిపట్టి నడిపించిన నేస్తమా,స్నేహ బాటను చూపిన వరమా..

ఈ మిత్రున్ని వీడి ఇన్నేళ్ళు ఎక్కడికి వెళ్ళావమ్మా?నీవు లేక ప్రొద్దుగూకుట భారమాయెన?

నడిపించే నీవు లేక,బ్రతుకు గమ్యం తెలియక నడిసంద్రంలోని నావలా పయనం లేక నిలిచిపొయేన?

ఎపుడోకపుడు కనిపిస్తావనుకొన్న,కాని ఆ'ఎపుడో' ఇపుడే అయ్యి తలపు చప్పుడులను ఆపి నిన్ను చూపింది.. 

మాటలు రావు, నీ చిన్ననాటి గుర్తులు తప్ప..

ఆకలి లేదు, మరిన్ని ఆనందాలు తప్ప..

ఆలోచనలు లేవు,నీ చిన్ని సొట్ట నవ్వు తప్ప..

చదువులేదు, మన స్నేహ మజిలీలొ అద్బుత పేజీలు తప్ప..

కాలమే పోదు, నీవు మటలాడిన క్షణాలు తప్ప.. 

Friday, September 7, 2012

మరి నిన్ను మరచేదెలా?



నిదుర లేస్తూనే చిగురిస్తున్నది నీపై ఆశల కల..
నీ వాలు చూపులతో వేశావు వలపుల వల..
ఉవ్వెతున ఎగిసిపడుతోంది నీపై ప్రేమ అల..
నీ నవ్వు మురిపిస్తోంది ఓ మెరుపులా..

నీ అంద అలరిస్తుంది కోనేటిలో తామర పువ్వుల..
నీ తియ్యని మాటలు ముత్యాల మాల..
మరి నిన్ను మరచేదెలా?

Thursday, September 6, 2012

నువ్వు తోడుంటే!



నీవు తోడుంటే చీకటిలోను పడమటి సంధ్యారాగమే..
నీవు తోడుంటే మనసుకి ప్రతి క్షణం పసితనమే..
నీవు తోడుంటే వయసుకు నెమలి నర్తనమే..
నీవు తోడుంటే మృదు తరుణాల మధువనమే..
నీవు తోడుంటే నవ్వులకు నిత్య యవ్వనమే..
నీవు తోడుంటే గుండెకు గోదారి పరవశమే..
నీవు తోడుంటే కలలకు మల్లె మాలికల వసంతమే...
నీవు తోడుంటే బ్రతుకు వెన్నెల్లో విహంగమే..
నీవు తోడుంటే జీవితం గలగల పారే జలపాతమే..
నీవు తోడుంటే ప్రతీ జన్మ సరిగమలతో సాగే సంగీతమే..