Tuesday, June 14, 2011

ప్రేమంటే మాయేనా..

నీతో కలసి మాట్లాడుతూ,నీతో కలసి నవ్వుతూ,నీతో కలసి నడుస్తూ కాలం గడుపుతున్నపుడు ఓ మంచి స్నేహితురాలివి మాత్రమె అనుకొని బతుకుతూ వచ్చాను.కాని నువ్వు దూరమైన మరు క్షణం నుండి తెలిసింది నేను నాలోని నిన్ను ప్రేమించానని.నీ ఎడబాటు భరించరాని విలువైనది అని.
 
ఈ ప్రేమ చాల విచిత్రమైనది ఎందుకంటే కలసి ఉన్నపుడు కనబడదు కనుమరుగయ్యాక కన్నీటి కధనాన్ని నడిపిస్తుంది.

నువ్వు నాకు దూరమయ్యావని,నేను నీకు దూరమయ్యానని,నన్ను వదిలి వెల్లిపోయావని వెలుతూ వెలుతూ నా ప్రేమను కూడా మూటగట్టుకొని పోయావని నిను మరచిపోవడము తేలికని భ్రమ పడ్డాను.ఓసారి దేవతలా తిరిగి కనబడ్డాక తెలిసింది నా ప్రేమ చావలేదని అదే నిరంతరం జీవపు వెలుగై నను నడిపిస్తున్నదని.

ప్రేమ అంటె మాయ అంటారు ఇదేనెమో.

Sunday, June 12, 2011

నా మొదటి కవిత..

నేను రాసిన మొదటి కవిత 1997వ సం.లో ఓ భూలోక రంభను చూసి.ఇల్లు సర్దుతుంటే కనబడింది..

ఓ నీలాకశాన పయనించె నీలి మెఘమ రూపమా!..మెరుపులా వచ్చి నా హృదయాన మెరిసావు.ఆకర్షిత మేఘానివై నా హృదయాన నీ అమృత జల్లులు(స్వరములు) కురిపిస్తావని తులసీదాసు వలె ఎదురు చూసే నీ ప్రియుడు..

ఈ వాన పడే తరుణంలో ప్రకృతి చిందించే అపురూపములు,సెలయేల్లు,ఆకాశ సోభాయమానము అందరి కొరకు దైవమిచ్చిన వరము.అందులో నేనొక ఆస్వాదకుడను.కాని దైవము నా కొరకు ఇచ్చిన ఒకే ఒక ప్రకృతివి నీవు.దానికి నేనొక్కడనె ఆస్వాదకుడను.నా మనసు నీ ఒడిలో హాయి లాగాలని నీ హృదయం వెంట పరుగెడుతుంది.అందుకో ప్రియతమ!.

ప్రేమ..ప్రేమ..ప్రేమ..

బొమ్మ చేతిన పట్టిన ఓ కుందనపు బొమ్మ..
నా గుమ్మం వైపు అడుగు పెట్టవే ఓ ముద్దు గుమ్మ..
ఓ ముచ్చటైన ముద్దు ఇవ్వవా పల బుగ్గల పసిడి రెమ్మ..
నీ నడక చూసి గుసగుసలాడే ఆ కొమ్మ కొమ్మ..
నీ ఓడిలో ప్రేమగా నను లాలించవే నా మరొ అమ్మ..
ఆ ఏడు అడుగులు వేస్తాను నీతోనే నా ప్రతీ జన్మ..

నా గుండె లోతుల్లో ఒదిగి ఉన్న ఓ వెన్నెలమ్మ..
నిను తలుస్తుంటె కారుస్తున్నవి నా కళ్ళు చెమ్మ..
ఇదేనేమో ప్రేమ..ప్రేమ..ప్రేమ..

మళ్ళీ రావా నా మైనా..


నా వయ్యారి కొన చూపుల కొలనులో కమలమై వికసిస్తూ ఉన్నా..
తన చిరునవ్వుల చెలిమికై ప్రతిదినము ఉదయిస్తూ ఉన్నా..
కాలం కరిగిపోతున్న నిత్య యవ్వనున్నై తన నామమే జపిస్తూ ఉన్నా..
తన లేలేత సొగసులు చూసి మిణుగురునై మురిసిపోతున్న..
తన అడుగుల సడులను విని నెమలినై నర్తిస్తూ ఉన్నా..
తన తపనలో మునిగి తనే నా శ్వాసై తరిస్తూ ఉన్నా..
తన ఎదలో చోటుకై ఉత్సాహంతో ఉరకలెస్తూ ఉన్న..
తన రాకకై తొలి తొలకరి జల్లుల వర్షిస్తూ ఉన్నా..
తన చేయిపట్టి నడవాలని ప్రతిక్షణము జన్మిస్తూ ఉన్నా..


ప్రియా! ప్రేమించమని ప్రాకులాడుతున్నా..పలుకవే ఓ మారైన..
నేను ప్రేమ చేసిన గుండె గాయాన్నా?
నిను మరవలేకున్నా..మళ్ళీ రావా నా మైనా..