Tuesday, June 14, 2011

ప్రేమంటే మాయేనా..

నీతో కలసి మాట్లాడుతూ,నీతో కలసి నవ్వుతూ,నీతో కలసి నడుస్తూ కాలం గడుపుతున్నపుడు ఓ మంచి స్నేహితురాలివి మాత్రమె అనుకొని బతుకుతూ వచ్చాను.కాని నువ్వు దూరమైన మరు క్షణం నుండి తెలిసింది నేను నాలోని నిన్ను ప్రేమించానని.నీ ఎడబాటు భరించరాని విలువైనది అని.
 
ఈ ప్రేమ చాల విచిత్రమైనది ఎందుకంటే కలసి ఉన్నపుడు కనబడదు కనుమరుగయ్యాక కన్నీటి కధనాన్ని నడిపిస్తుంది.

నువ్వు నాకు దూరమయ్యావని,నేను నీకు దూరమయ్యానని,నన్ను వదిలి వెల్లిపోయావని వెలుతూ వెలుతూ నా ప్రేమను కూడా మూటగట్టుకొని పోయావని నిను మరచిపోవడము తేలికని భ్రమ పడ్డాను.ఓసారి దేవతలా తిరిగి కనబడ్డాక తెలిసింది నా ప్రేమ చావలేదని అదే నిరంతరం జీవపు వెలుగై నను నడిపిస్తున్నదని.

ప్రేమ అంటె మాయ అంటారు ఇదేనెమో.

1 comment:

kalpa latika said...

"నీ ఎడబాటు భరించరాని విలువైనది అని" bharincharaani viluvaina...baaga vaadaru...prayogam baagundi.కన్నీటి కధనాన్ని నడిపిస్తుంది.e prayogam kuda baagundi.....baaga raasaru...