Friday, October 12, 2012

కాబోయె శ్రీమతి కోసం కవిత

                                నాకు కాబోయె శ్రీమతి కోసం రాస్తున్న ఈ చిన్ని కవిత..తన పేరు పల్లవి.

పల్లవి.. నా హృదయ రాగాల పల్లవి..
చీర కట్టుతో నడిచే సింధూరానివి..
నాజూకు సోయగాలొలికె విరజాజివి..
నా గుండె చప్పుళ్ళకు నీవే సిరిమువ్వవి..
నా ఎద లోతుల్లో ఒదిగున్న చైత్రానివి..
చిత్రమైన కొన చూపుల చెలివి..
చిరునవ్వుల ముత్యాల జల్లువి..
ఇది వరకు నా బ్రతుకు కలల ఎండమావి..
నీ రాకతో ప్రతినిత్యం మోహనుని పిల్లన గ్రోవి..
ఈ ఒంటరి జీవితాన్ని కడ దాక నడిపించే జతవి..
ఇకపై నీవే నా ప్రతీ జన్మకి అవ్వాలి సీతవి..
నీవే నా కమనీయ కవితా లోకపు వెల్లువవి..
ప్రేమ బాటన నడిపించే వెన్నెలవి..
నా ఈ జీవితాన్ని మలుపు తిప్పిన కొత్త కధవి..

ప్రేమ శృతివి,రంగుల వసంతానివి,నా బుజ్జి బంగారానివి..


5 comments:

Anonymous said...

ఈ ఒంటరి జీవితాన్ని కడ దాక నడిపించే జతవి..

both don't forget this for ever. wish u happy married life

శ్రీ said...

చాలా బాగుంది కాబోయే ఇల్లాలికి ఇచ్చే అమూల్యమైన కవితా హారం...
ముందస్తు అభినందనలు...మీకు ఇద్దరికీ ఆశీస్సులు చక్రధర్...:-)...@శ్రీ

Chakradhar Sarma Rayapati said...

thx andi mee iddariki

పరిమళం said...

Very nice!All the best!

Admin said...

Wish u a Happy married life...