మనసు ఆలపించే ప్రేమ గీతికలు..మధి మాటున దాగున్న మౌన తరంగాలు..కల్ల నుండి జాలువారె కన్నీటి కధనాలు..ఎదలోతున ఉప్పొంగుతున్న అనుభూతుల అలలు..తీపిగా సాగే వెన్నెల కలలు ..ఆశల కిరణాలు..ఇంకా ఎన్నో ఎన్నెన్నో ..ఇవే నా ఈ "నా మనో భావాలు"..
Friday, July 26, 2013
Thursday, July 11, 2013
అణువణువులో నీవే..
సరిగమల తీగవై నాజూకు వయ్యారాలు వొలికావు
ముత్యాల నవ్వులన్నీ నా హృదయంపై చల్లేశావు
ఎద తరిమే స్వప్నాలు మదినంతా నింపేశావు
చిరు జల్లుల స్వరములతో తనువంతా తడిపేశావు
గగనాన హరివిల్లులా అడుగులతో అలరించావు
రంగవల్లికవై తెలుగింటి అమ్మాయిలా ఆకర్షించావు
పచ్చని పైరులా స్వచమైన ప్రేమ కావలన్నావు
బ్రహ్మ చేతి నుండి ఇంకొ అమ్మవై మరో జన్మనిచ్చావు
ఆశలన్నీ కాలరాసి కాలగమనంతో కనుమరుగయ్యావు
కాని అదృశ్యమైన నువ్వు నా అణువణువులో ఉన్నావు
Tuesday, July 9, 2013
నను విడువదవేల ప్రియా!.
చీకటితో స్నేహం నాకు నీవు చెలివై దూరమైనందుకు
ఏకాంతమే ఒదార్పు నా గుండెకు నీవు నన్ను ఒంటరిని చేసి వెల్లిపోయినందుకు
నీ తియ్యని జ్ఞాపకాలే సేద నాకు నీవు ఎదపై ఆటలాడినందుకు
నీ నవలావణ్య రూపమే ఆహర్యం నాకు నీవు కలల్లో విహరిస్తున్నందుకు
నీ మనోహర సైగలే శ్వాస నాకు మరో జన్మనైనా ఎత్తేందుకు
రక్తంతో రాసే ఈ రమణీయ ప్రేమ కావ్యనికి నీవే రమ్య దేవతవు..
నను విడువదవేల ప్రియా!.
Saturday, July 6, 2013
ఆడది..ఆడది
అందం అంటే ఆడది
అమ్మతనం అంటే ఆడది
జగతి జాగృతి ఆడది
జడ సొయగాలు ఆడది
సంస్కృతికి తోరణం ఆడది
సన్మార్గపు జ్యోతి ఆడది
ఒరిమి చూపే ధరిత్రి ఆడది
చిరునవ్వుల బలిమి ఆడది
ప్రాణం పొసేది ఆడది
ప్రేమను పంచేది ఆడది
గుండెల్లో దాగుండేది ఆడది
గుడిలో కొలిచేది ఆడది
ఈ సృష్టికి ఆది ఆడది తుది ఆడది..
ఆడతనమున్న ఆడది సకలం సర్వం తనకి సర్వదా శరణం..
Wednesday, June 19, 2013
నా చీకటి మనో మందిరం..
కాల చక్రం గిర్రున తిరుగుతుంది తనదైన దారిలో
ప్రకృతి తల్లి రుతుక్రమంతో పులకరిస్తోంది ప్రతి నిముషం
ఒడిదుడుకులు వెక్కిరిస్తు సాగుతున్నాయి మానవుని నవ్య జీవితాన్ని
నిజమైన ప్రేమ నవ యవ్వనంతో వయ్యారగముగా పొద్దుగడుపుతోంది
ఎదలోతుల్లొ నీపై దాగున్న నా అజరామరమైన ప్రేమ ప్రతిక్షణం జన్మజన్మాంతరాలకు పువ్వుల వికసిస్తూ వర్షపు చినుకులా మెరుస్తూ వెచ్చటి శ్వాసలా ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంది...
దానితో పాటు నీ గుండెల్లో నా పవిత్రమైన లేత ప్రేమ ఇమడలెక నిర్జీవమై మరణాన్ని శాసిస్తూ ఉంటే ఈ నిజాన్ని భరించలేని నా హృదయపు ఆశలు చెదిరి భూమి తల్లిని చేరుకొంటే
తిరిగి తొలకరి మొగ్గై చిగురిస్తుందా లేక మట్టి పాలై మరో చరిత్ర సృష్టిస్తుందా నా దారితప్పిన ప్రేమ?
నీవైనా తెలుపవా నా చీకటి మనో మందిరమా!..
Subscribe to:
Posts (Atom)