Monday, October 4, 2010

మా తెలుగు తల్లికి మల్లెపూదండ!.

 



                            

సృష్టి తల్లికి,జగత్తు తండ్రికి పుట్టిన ముద్దుల బిడ్డ తాను..
భరతమాత సిగలో బంగారు పువ్వు తాను..

పుడమి తల్లిపై ప్రతిధ్వనించే పలకరింపు తాను..
పుడమి తల్లిని పలకరించే ప్రతిధ్వని తాను..

నిశ్శబ్దాల చీకటిలో గళ్ళుమనే కాంతి కిరణ కంఠం తాను..
ఉప్పొంగే కవి హ్రుదయ భావాలకు పట్టము తాను..

జాతి సంస్కృతికి,సంస్కారాలకు జనని తాను..
నిదిరిస్తున్న జనాన్ని తట్టిలేపె సూక్తి ముక్తావళి తాను..

చరిత్ర పుటలకు,పురాణ స్మృతలకు గట్టి అధారం తాను..
గతించిన కాలాన్ని లిఖించి చెప్పే అనుభవసారం తాను..

తెలుగు వెలుగుల జాతి గౌరవానికి,గర్వానికి నిలువెత్తు ఆభరణం తాను.. 
యుగయుగాల మన కీర్తి ప్రతిష్ఠలకు పచ్చల కిరీటం తాను..

మానవాళికి మమతానురాగాలు పంచే మాట తాను..
పులకింప చేసే ప్రకృతిని చెప్పే పంచామృత ధార తాను..

తరతరాలుగా నిలిచి ఉన్న బంధాలకు అనుసంధానం తాను..
ఆరాదించి స్వాగతమిచ్చే మహరాజుల ఇంట పెద్దపీట తాను..

ఎత్తైన శిఖరంలా పొగడ్త తాను..హిమాలయంలా చల్లని హిమం తాను..

ఈ సృష్టికే తీపి తాను,ప్రతి తెలుగోనికి తల్లి తాను..

శిశువు నుండి వృద్దుని దాక మాటతో నడిపించే రహదారి తాను..
అచ్చమైన ఆంధ్రుడి దశ తాను,దిశ తాను..

ఆమె మన ముద్దుల చక్కనమ్మ,చుక్కలమ్మ,అంధ్రుని అమ్మ మన తెలుగు తల్లి.

తెలుగులోనే మాట్లాడతాం,తెలుగుని కాపాడతాం.దేష భాషలందు తెలుగు లెస్స అని మరోసారి చాటి చెబుతాం.

జై తెలుగు తల్లి,జై జై తెలుగు తల్లి.


1 comment:

chanukya said...

ఎక్కడో స్పృశించారు