Wednesday, October 20, 2010

నిన్నే తలిచా-నీవై తడిశా!..



నీకై అన్వేషిస్తూ పరుగులు తీస్తుంటే పువ్వులు పక్కున నవ్వె
ఈ ప్రేమాన్వేషికై జన్మించిన మరో పువ్వుకోసం పరితపిస్తున్నాడని..

నిన్నే అనుసరిస్తూ బువిపై అడుగులు వేస్తుంటే అది కోటి దీపపు కాంతులను చిమ్మె
ఈ ప్రేమబానుడు  నీ హ్రుదయ తెరలపై పాదముద్రలు వెస్తున్నడని..

నిన్నే కలవరిస్తూ కన్నీరు కారుస్తూ ఉంటే పాలసంద్రం పరవళ్ళు తొక్కె
ఈ ప్రేమ తపస్వి
నీకై  కంటున్న కలలు అలలై ఉవ్వెత్తున పొంగుతున్నాయని..

నిన్నే తలుస్తు కరిగిపోతుంటే హిమము తరిగి సలయేరై పారే
ఈ ప్రేమాభిమాని నిన్ను చేరె తరుణం త్వరపడినదని..

నీవే సర్వమై చలించి పోతుంటే ఆ చంద్రుడు చరితై చిత్రముగా చూసే
నా వన్నె చిన్నెల వయ్యరి కంటి వెలుగులు వెన్నల కన్నా చల్లనివై నన్ను కరుణించునని..

నీకై ప్రతిక్షనం మరణిస్తూ,పుడుతూ వుంటే ఆ అగ్నికి శక్తి చమ్మగిల్లె
ఈ ప్రేమనిరీక్షకుడిని దహించే విరహం మరొ బలమైన మంట అని..

నిన్నే స్మరిస్తూ ఎద సడులను గమనిస్తూ ఉంటే వీణ నాదాలు విస్తుపోయె..
నీకై స్వరించే నా విరహ గాన గీతికల స్వరాలు నీ ఆవరణలు అయ్యాయని..

నీకై తపిస్తూ ప్రేమ పరుస్తు ఉంటే ఆ శిల్పాలు తిరిగి శిలలు గా మారే..
ఆ శిలలపై ఏ శిల్పి నీలాంటి పాలరాతి బొమ్మని మలచలేదని..

No comments: