Thursday, October 28, 2010

తుర్రుమనే జీవితం..


మానవుని జీవిత చక్రం జననం నుండి మరణం దాక...
 చిరుచిరు నవ్వుల జననం,కలకల లాడే తరుణం..
గలగల లాడే బాల్యం,తికమక పెట్టే పుస్తక పఠనం..
త్వరత్వర గా వచ్చే యవ్వనం,జిగజిగ లాడే  స్వప్నం..
మిసమిస చూపుల అమ్మాయిలు,గుసగుస లాడే మనసులు..
నకనక లాడే పొట్ట కోసం,చకచక పరుగుల ఉద్యోగం ..
గజిబిజి బతుకుల గమ్యం,రాజి రాజి ల పోరాటం..
రకరకాల మనుష్యులు, కలకలాలు రేపె ప్రేమలు..
తళతళలాడే వివాహ సంకెళ్ళు,పెరపెర లాడే రాయబారాలు..
మిలమిల
లాడే దూరపుకొండల సంసారం,కోరికోరి సమస్యల వలయం..
టకటక నడిచే కాలమానం,బిరబిర మీదకొచ్చే బాల్య వృద్ధాప్యం..
పకపక నవ్వే మృత్యు విలాసం,గోరి గోరి తీస్కెల్లే మరణం..

ఇదే జల జల రాలే జీవితం.. చరచర చినిగే కాగితం.. 

ఇదే యుగయుగాల ఆరాటం..జగజగాల కధనం..తరతరాల పయనం..

No comments: