Wednesday, November 24, 2010

నిను మరచిపొయేదెలా?



దేవతలా వచ్చింది జీవితానికి కొత్త ఆశలతో రంగులు అద్దడానికి,
స్నేహ హస్తాన్నిస్తూ అడుగులు వేసింది నా హృదయములోకి,
ఆకారాన్ని ఇచ్హింది నా కలలకి,అందులో విహరించడానికి,
కనిపించింది కనుమరుగయ్యి నా ప్రేమను కాలరాయడానికి,
కారణం అయ్యింది నాలోని ఓ కన్నీటి ప్రేమ కధకి
మిగిల్చింది ఆవేదనను నా మధికి,
తలవంచాను బలికావడానికి ఆ విధికి,విరహానికి
చేరుకొంది తన తీరానికి, కావడంలేదు తనను మరచిపోవడానికి..
కాలం ఒప్పుకోవడంలేదు దాసోహం అన్నా ఆ మృత్యువుకి..

Sunday, November 21, 2010

ఇదేమి లీలరా నీది శంకరా!..


గంగమ్మను నెత్తిన పెట్టుకోని తాండవమాడేవు,
ఇచ్చట తాగడానికి చుక్క నీరు లేకుండా చేసావు.
                                               ఇదేమి లీలరా నీది శంకరా!..


సురులను రక్షించుటకు గరళాన్ని కంఠంలో దాచి నీలకంఠుడవయ్యావు,
నీ బిడ్డలకు బాధలను మింగి పేదరికాన్ని గుండెల్లో జీర్ణించుకొనే శక్తినిచ్చావు.
                                               ఇదేమి లీలరా నీది శంకరా!..


ఈ భువిపై నువ్వున్న ప్రతిచోటా గౌరమ్మను,ఆమె సవతిని తోడుగా పెట్టుకొన్నావు,
మాకు మాత్రం నువ్వున్న ఇదే భువిపై కష్టాలను తోడుగా పెట్టావు.
                                              ఇదేమి లీలరా నీది శంకరా!..


నిత్యజ్ఞానివైన నీకు కార్తీకపౌర్ణమిన జ్యొతులను వెలిగించమ్మన్నావు,
కాని మమ్ము మాత్రం సత్యమేదో తెలుసుకోలేని అజ్ఞానంలో అలానే ఉంచావు.
                                               ఇదేమి లీలరా నీది శంకరా!..


నిత్య ధ్యానివై సర్వదేవతలచే ఆరాధనలు తీసుకొంటూ కైలాసములో ఆనందముతో 
వసించేవు,
ఈ కష్టాల కడలిపై మమ్ము త్రోసి ఆ ఒక వంతు భూమిని కూడా కన్నీటిమయము చేసావు,
                                               ఇదేమి లీలరా నీది శంకరా!..


నీకు రెండు కళ్ళుచాలవని మూడవ కన్నుని కూడా పెట్టుకొన్నావు,
పుట్టు గుడ్డివాళ్ళకు,ధన మధ కామ అహంకారులకు ఒక్క కన్ను కూడా లేకుండా చీకటిని ఇచ్చావు..
                                               ఇదేమి లీలరా నీది శంకరా!..


అవేకళ్ళను మూసి అదె చీకటిలో నిన్ను వెతికేవాల్లకి
పరమగతిని చూపి పరంజ్యోతివై పరమార్ధసిద్ధినిచ్చేవు...
                                               ఇదేమి లీలరా నీది శంకరా!..

Thursday, November 18, 2010

నేను ఆమెను ప్రేమించాను-1



అది ఓ దివ్యమైన రోజు,ఓ మధురమైన రోజు,ఓ ప్రత్యేకమైన రోజు,ఓ చిత్రమైన రోజు.అచ్చం గా నా రోజు.నా ప్రేమకు ఆది రోజు.ఎందుకంటే కంటి చూపుతో మనసును మీటేటి,చిత్రమైన నవ్వుతో హృదయాన్ని కట్టిపడేసేటి,సుగుణ లావణ్యంతో మధిని మొహన పరచేటి,పువ్వుల గుసగుసలల వలె మాటలు ఆ మాటల మంత్రములతో ముగ్దున్ని చేసెట్టి,కలలతో కాలాన్నిసైతం మరపించేట్టి,ఓ క్షణాన్ని అమృతమయం చేసి ఆ స్వర్గంలో నన్ను బంధించినట్టి,కమలపు శోభలతో ప్రకశించేట్టి ఓ సౌందర్య రాశిని,అనంతంవరకు నిలిచే ఆమె అందాన్ని,నా ఆనందానికి రూపమిచ్చినట్టి "ఆమెను"చూసాను.


తెలియని ఉల్లాసం ఎద నిండా అలుముకొంది.వెన్నెల కాంతులు మధి నిండా పులుముకొన్నాయి.గుండె చప్పుళ్ళ అలజడికి ఆశలకు అలికిడి రేగి కొత్త జీవితానికై నింగికి ఎగిసిపడ్డాయి.నాలోన నిదురొతున్న ప్రేమను తట్టి లేపాయి.నా హృదయ నిశీధిలోని చీకటి దారులను తన పాద స్పర్శలతో వెలుగుల మయం చేసాయి.నా ఊహల సామ్రాజ్యానికి చక్రవర్తిని అయ్యాను.తనను నా ప్రేమకు పట్టపు రాణి చేసి ఆ స్నెహలోకంలో మెమిద్దరమె బతికాము.నాలో ఓ ప్రేమాంకురం మొలిచెను.ప్రేమించనారంబించాను.


నేనూ ప్రేమించాను.నాలోని ఆమెను ప్రేమించాను.ఆమెను నన్నులా ప్రేమించాను.నాకై జన్మించిన ఆమెను ప్రేమించాను.ఈ జన్మకు ఆమెనే ప్రేమించాను.ఆమెకోసమె బ్రతికేలా ప్రేమించాను.నేను ఆమెలా మారిపొయేల ప్రేమించాను.ఆమె నాలొ సగబాగంలా ప్రేమించాను.నేను ఆమె ఒకటే అన్నట్టు ప్రేమించాను.నాకోసం ఆమెను ప్రేమించాను.నేనే ఆమె,ఆమే నేను అనేలా ప్రేమించాను.ప్రతిక్షణం ఆమెలో నన్ను,నాలో ఆమెను వెతికేలా ప్రేమించాను.కలల్లో,ఊహల్లో,నిదురలో,నడకలో,మాటలో,ఏకాంతంలో,తనువులోని అణువణువులో ఆమెను ప్రేమించాను.ప్రేమకై నేను చూపె ప్రేమను చూసి ఆ ప్రేమె ముచ్చటపడేలా ప్రేమించాను.ప్రేమ మయం ఈ జగత్తు అన్నట్టు ప్రేమించాను.
                                                                  (ఇంకా ఉంది..)


రచన
-మీ చక్రధర్

Wednesday, November 17, 2010

మరుగేల ఓ ప్రియా!..

 

నీ స్వరములు వరములై హృదయ తలుపులు తడుతూ ఉంటే,
నీ చూపులు భాణములై నా గుండెలను సంధిస్తూ ఉంటే,
నీ కలలు మలుపులై నా గమ్యంవైపు తప్పటడుగులు వేయనిస్తుంటే,
నీ నవ్వులు పువ్వులై నా మనసు వనంలో వికసిస్తూ ఎడబాటుతో ఏమారుస్తుంటే,
నీ రూపులు సుడిగాలులై నను చుడుతూ ఏకాంత లోకాలకు నెడుతూ ఉంటే,

నిన్ను మరవలేని స్థితి..ఏమి దిక్కుతోచని పరిస్థితి..
నీకై వేచిచూస్తూ అలసిపొయా..జీవితంవైపు అడుగులు వేయలేక సొలసిపొయా..

మరుగేల  ప్రియా!..కరుణించగ రావా..నా బ్రతుకులో కలిసిపొవా..

Tuesday, November 16, 2010

తెర తొలగదా?నిజమవ్వదా?

  

     ఎప్పటిలాగె చీకటి వీధుల్లో ఒంటరిగ నడుస్తున్నాను.ఓ రోజు మాత్రం ఉన్నట్టుండి నా పక్కనుండి సుంగధముల సువాసనలు,పారిజాత  పరిమళాలు,వీణా నాదాలు ,ఎదను హత్తుకొనేలా  కళ్యాణి రాగం ఇవన్ని గుంపులా చేరి నా పక్కనే నర్తించ సాగాయి నేను అదేదొ కొత్తలోకంలో ఉన్నట్టు.విచిత్ర  భావనలతో నా మధి పులకించింది..

  అమాంతమున నా చేతి పై తెలియని స్పర్శ.ఆ స్పర్శకి తనువు పులకించింది.వయస్సు తుల్లిపడ సాగింది.హృదయం గాలిలొ తేలినట్టు అయ్యింది.మది ఆనందంతో పరవళ్ళు తొక్కుంతోంది. ఎద సడి అలుపులేకుండా చిందులేస్తోంది. చిత్రమైన చిరునవ్వు.జీవితం ఓ రంగుల హరివిల్లులా అనిపించింది.

గుండె లిప్త పాటు లయతప్పినట్టు కాగా చిన్నపాటి వణుకుతో నెమ్మదిగ తల పక్కకి తిప్పి చూశాను.ఓ అప్సరస పాలమీగడతో తెలుపుని పులుముకొన్న చక్కటి చీరను దరించి పెదవులపై నుండి జారనివ్వని చిన్న చిరు నవ్వుతో నా కల్లలోకి చూస్తు నా చెతి ముని వేల్లను తన చేతితో పట్టుకోని తన వెంట తీసుకెల్లింది సరిగమలు కూడా నృత్యం చేసె ఓ విచిత్రమైన కొత్త లోకానికి.తన వెంట నడక సాగిస్తుంటే తన కురులు నా మోమును అలా తాకి వెళుతుంటే రెండు స్వర్గలోకాల మద్యన ఓ మెత్తటి వారధి పై నడుస్తున్నట్టు అనిపించింది.పక్కనుండి వీచే పిల్ల తెమ్మెరలు, తన మేని పరిమళాలు,తన నుండి వెలువడే వెచ్చటి శ్వాస నన్ను నేను మరచేల మైకాన్ని ఇస్తున్నాయి.ఆ క్షణం రసరాగమయంలా అనిపించింది.

    ఆ కొత్త బంగారు లోకం లో ఓ వెండి జాబిలి,ఆ జాబిలిలో ఓ బృందావనం.అందులో రాధామాధవుల ప్రణయ ప్రతిమ.ఎక్కడ చూసిన వెన్నెల వెలుగులు.పక్కనే పారుతున్న సెలయేటి గలగలలు,రంగు రంగుల పుష్పాలు,చిన్నగా చెవులను తాకే సుస్వరాలు ఇలా చాలా, మా ఇద్దరి కోసమె సృష్టించబడ్డ ఓ స్వర్గం లా వుంది.

   తను నన్ను మల్లెల బాటపై నడిపిస్తూ ఆ రాధమాదవుల ముందరనె వున్న  నందివర్ధనములతో పేర్చి వున్న ఓ పట్టు పరుపు పై కూర్చొబెట్టి తన వడిలో నా తలనుంచి నా నుదురును నిమురుతూ మనసుతో గుసగుసలాడుతూ "ఇప్పుడు చెప్పు ప్రియా! నీతో అ ఏడు అడుగులు వేయడానికి ఎవ్వరు లేరా?" అని..
మరి నువ్వు ఎక్కడి నుండి వచ్చావు,నిజము గా నా వెంటనే వుంటావా?నాతో కలిసి నడుస్తావా? అని నేను అడుగబోతున్నాను, ఇంతలో...

నా వీపుపై బాగా గట్టిగా రెండు దెబ్బలు పడ్డాయి.ఎవ్వరు అని కల్లు తెరచి చూస్తే బారెడు పొద్దెక్కినా మొద్దు నిద్ర,పగటి కలలు ఏంట్రా అని తిడుతు అమ్మ...లేచి చూస్తే ఇదంతా ఓ తియ్యని స్వప్నం..

    ఎప్పటిలాగె ఈ జగం చీకటి పడింది అని.కాంతులను విరజిమ్మె రవి కిరణుడు కూడా మెల్లగ తప్పుకొని తన వంటిపై నలుపు ని పులుముకొని తన వెంట దాక్కొని వున్న రాత్రిని కోటి ఆశలతో కంటున్న మన వెన్నెల కలలకు వెలుగును నింపడానికి కాస్త కాలం కనుమరుగయ్యాడని ,మెల్లగా నా కంటి రెప్పలు వెనక చీకటి కనపడ సాగి నాకు తెలియకిండా నేను నిద్రలోకి జారిపొయాను అని,తోడులేని ఒంటరి జీవితపు శూన్యపు నీడల్లొ కాలం గడపాలని తెలిసి కూడా నిదురపోతున్నానని,ఈ శూన్యపు జాడల్లో కూడా కనపడని వెలుగు కోసం,ఓదార్చే వడికోసం ఓ చిన్నపాటి కన్నీటి హృదయంతో మది తచ్చాడుతూ వుంది అని తెలిసింది.ఇదంతా రాత్రి,నిద్ర ఆడిన వింత నాటకం అని గుర్తొచ్హి ఓ తియ్యని నవ్వు నవ్వుకోని నా స్వప్న సుందరికై అన్వేషణ సాగించనారంబించా తనకై పరుగులు సాగించా...
ఇది ఓ అమ్మ-స్వప్నం-అన్వేషణ కథ.
రచన
మీ చక్రధర్


Wednesday, November 10, 2010

ఆ సొగసు చూడ తరమా?..

 
                                          చీర కట్టే పడతి వెలుగుల జగతి..
                                          చీర కట్టే ఇంతి సంస్కృతి ప్రగతి..
                                          చీర కట్టే యువతి వయ్యారముల కాంతి..
                                          చీర కట్టే చిన్నది తీపి స్వప్నముల నిధి
                                          చీర కట్టే బామ సింగారముల సీమ...
                                          చీర కట్టే లలన వెండి కుంకుమ బరిణే..
                                          చీర కట్టే మగువ పరువపు పొంగుల వెల్లువ..
                                          చీర కట్టే అమ్మాయి సరిగమల సన్నాయి..
                                          చీర కట్టే ఆమె రత్నముల ప్రతిమె..
                                          చీర కట్టే కాంత సంకురాత్రి ముగ్గంత..

                                          చీర సొగసు పొగడ ఆ శంకరుని తరమా?

Tuesday, November 9, 2010

నటనో లేక దైవ ఘటనో..


ఓ హృదయం కిటికి మాటున నిలబడి ఆకాశం వైపు ఆశగా ఎదురుచూస్తోంది ఎన్నటికైనా తిరిగి వస్తుంది తన నేస్తం అని..
లిప్త పాటున గుండె లయతప్పే తన సుమధుర దరహాసాం విని..
మనసు పొరల చాటున వున్న ఆశలకు రెక్కలొచ్చి ఆవిరై అనంతం వైపు పరుగులు తీసాయి..
మది చాటున ప్రేమాంకురం మొలకెత్తి మరువలేని ఓ ప్రేమకదనాన్ని నడిపించెను..
అలవాటున వేల సార్లు వెతికి చూసెను ఎదలోతున..
విది కాటున కలలన్ని సాగరంలోని తిరిగి రాని తరంగమల్లె మిగిలిపొయయి..
పొరపాటున బతికానని మరణం ప్రతి నిముషం వెక్కిరించే..
ఈ ప్రేమ బాటన సాగలేక,ఆగలేక,ఎటుతోచక కంటనీరు కారుస్తు మిగిలిపోయను ..
మరో మారున తిరిగి రాదని చేదు నిజాన్ని జీర్నించుకోలెక జీవోచ్చమయ్యెను ..
ఈ ఎడబాటున క్షణం ఓ యుగం గా తీపిలేని జీవితాని గడుప సాగెను..

ఇది ఆమె నటనో లేక దైవ  ఘటనో  తెలెయలేక రోదిస్తూ కాలాన్ని సాగదీసెను ..

Monday, November 8, 2010

ఎదురుచూస్తూ వుంటా..


చల్లని చిరుగాలిలో పయనం చేస్తుంటే మది నిండా నీ కమనీయమైన రూపం..
కాని నువ్వు చెంత లేవని కళ్ళ నిండా కన్నీరు.
రెప్పపాటు కాలమైన కూడా నిను మరవనివ్వని నీ చిరునవ్వు..
పోని నిదురైన నిను దూరం చేస్తుంది అంటే అక్కడ కూడా నీవే కలవై పలకరింపు..
పోని నీకు దూరము గా సుదీర తీరాలు చేరుకొందాము అనుకొంటే నీ ఆలొచనల దరి దాటనీయవు..
ఈ ఎడబాటును ఎద చాటు నుండి నీ చిలిపి అల్లరి చిత్రమైన సైగలు మరింత విరహాన్ని రేపు తున్నాయి
ఈ నిశ్శబ్ద నిశీధిలో నీ మౌన వీచికలు న మూగ మనసును మరింత మీటుతున్నాయ్..
ప్రతి క్షణం నీ ధ్యాసతో,నీ ఊసులతొ.. నాలో నువ్వు, నాకై నువ్వు,నువ్వే నేనుగా బతికేస్తున్నా...

ఇంతటి బాధను కాలకూఠ విషంలా బరిస్తున్నా నీ మనసు కరగదా,నాపై జాలి రాదా...
నీవెప్పటికైన తిరిగి వస్తావని నీకై ఒంటరిగా ఎదురుచూస్తూ వుంటా..

Sunday, November 7, 2010

మన ప్రేమకు సాక్షి ..



అమ్మ సాక్షిగా నేను అనంతంలో కలిసిపొయే వరకు నిను ప్రేమిస్తూనే ఉంటా..
దేవుడి సాక్షిగా నా దేవత నీవేనని నిత్యము నిను పూజిస్తూనే ఉంటా..
గుండె సాక్షిగా ఆఖరి శ్వాస వరకు నిను నిత్యం తలుస్తూనే ఉంటా..
మనసు సాక్షిగా నీ మాటలకై మౌన మునిలా నిత్యం తపస్సు చేస్తూనే ఉంటా..
కనుల సాక్షిగా సృష్ఠి అంతం వరకు నీ కలలను కంటూనే ఉంటా..
జీవితం సాక్షిగా ప్రతి జన్మ నిను వెంటాడుతునే ఉంటా...

నా సాక్షిగా ..
                 ఒక్క అడుగు నా వెనుక వేశావంటే నా ప్రాణం నీకిస్తా,నా రక్తంతో మన ప్రేమ కావ్యాన్ని రచిస్తా,నా గుండెను చీల్చి నీకు ప్రేమను పంచుతా,నా శ్వాసతో నీకు రక్షణ కవచం కలిగిస్తా..నిరంతరం మన ప్రేమ గీతాన్నె ఆలపిస్తా..

ఓసారి నా చేయి అందుకోవా ప్రియా!..

Wednesday, November 3, 2010

వచ్చిందోయ్ వచ్చింది..



వచ్చిందోయ్ వచ్చింది దీపావళి పండుగ వచ్చింది..
తెచ్చిందోయ్ తెచ్చింది అజ్ఞానాన్ని రూపుమాపే కాంతులని..
ఇచ్చిందోయ్ ఇచ్చింది మనుష్య జాతిలొని నరకాసురులని చంపే శక్తిని..
చెప్పిందోయ్ చెప్పింది ప్రతి ఒక్కరిలో ఓ సత్యభామ బయలుదేరాలని..
రక్షించిందోయ్ రక్షించింది ప్రజలందరిని చెడు బారినుండి..
చేసిందోయ్ చేసింది శ్రీకృష్ణుని అవతార కార్యాన్ని గుర్తుకి..
కలిపిందోయ్ కలిపింది అన్ని మతాలని ఒకే పండుగకి..
లేపిందోయ్ లేపింది అందరిలో నిద్రపోతున్న మంచితనాన్ని..
నింపిందోయ్ నింపింది అందరి ఇంట డబ్బుల మూటలని..
అనిందోయ్ అనింది ప్రజలంతా శాంతి సౌఖ్యాలతో కళకళలాడాలని..

నచ్చిందోయ్ నచ్చింది పిల్ల,పెద్దలకు పటాకులతో ఆటలన్ని..

"మీ అందరికి దీపావళి శుభాకాంక్షలు..." 
                                                -మీ ఛక్రధర్
"సర్వేజనా సుఖినోభవంతు!.."



నీకై తడిసిన కంటితో..


 
కళ్ళ ముందు కలవై తిరుగుతున్న కలుసుకోలేకున్నా..
తిరిగిరావన్న నిజం నాతో వున్నా గమ్యం మార్చుకోలెకున్నా..
మాయచేసి మోసగించినా నిన్ను మరచిపొలేకున్నా..
ప్రేమ మిగిల్చిన చేదు చరిత్రను కన్నీటి కావ్యంలా రచిస్తునా..
నీ ఎడబాటుతో మోడుబారిన మనిషల్లే బతికేస్తున్నా..
గుండెను గాయం చేసినా నవ్వుకొంటూ ఆనందంగా బరిస్తున్నా..
నీ నవ్వు,మాట,నీ రాక మాయ అని తెలిసి సహించలెకున్నా..
కనుమరుగయ్యావని తెలిసి కన్నీరు కారుస్తూన్నా..
నువ్వు కాదన్నా నీ రాకకొసం గుమ్మం వైపు ఎదురుచూస్తున్నా.. 
వెంటరాని మరణం వెంట పరుగులు తీస్తున్న..

తెలిసి ఇన్ని తప్పులు చేస్తున్నా అడగవేం ఒక్కసారైన..

Tuesday, November 2, 2010

నీవెవరివో?




                                      తీపి జ్ఞాపకాల చిరస్మరణీయతవో,
                                      ఎద మరుగున దాగున్న మౌనానివో,
                                      కవి భావనలకు కల్పనవో,
                                      హ్రుదయ తలుపులు తట్టే ఆకాశవాణివో,
                                      చిలిపి చిత్రాలు చేసె చైత్రానివో,
                                      గుండె గోపురానికి ప్రేమ గంటవో,
                                      అలై పోంగే సాగరానివో,
                                      మమతల మల్లికల సుమమాల అల్లికవో,
                                      నడిసంద్రంపై నడిచే నావవో,
                                      దివిసీమలో వెలిగే శ్రావణ జ్యొతివో,
                                      వెండి వెన్నెలలోని పాలరేకువో,
                                      చీకటి మోసుకొస్తున్న మంచు తెరవో
                                      రవి కిరణుడిలోని బంగారు తీగవో,

                                    తొలి సంధ్యవో,కరి మబ్బువో,సిరిజోతవో,విరిబోణివో..
                                             ఎవరివో?ఇంతకు నీవెవరివో?

నేనెవరు?



నా గమ్యాన నేను నడిచి వెళుతుంటే నడిచొచ్చే దేవతలా కనిపించావ్..
నీ చూపుల వశీకరణంతో నీ వెంటే తీసుకెళ్ళిపోయావ్..
నాలో నువ్వు చేరిపొయావ్,నేనె నీవు గా మారిపోయావ్..
నీ ఆలోచనలతో నా అన్న వాళ్ళు లేకుండా చేశావ్..
ఏ దారి లేని ఎడారిలో నన్ను నిర్దాక్షిణ్యం గా ఇలా పడేసి వెళ్ళిపోయావ్...
నా చుట్టూ శూన్యపు చీకట్లు,నీ ఆలొచనల సుడిగాలులు..కీకారణ్యం లా ఒంటరితనం, గుండే పగిలి వచ్చే కన్నీరు..నిర్జీవమైన దేహం,నిరాశతో మొద్దుపడిన జీవితం..చేప్పలేని బాధ,తట్టుకోలేని వ్యధ
దగ్గరకు తీయని మరణం..ఇది నా దీన స్థితి.
ఎందుకు నాకీ శాపం?

ఇప్పుడు నేనెవరు?నాలో ఎవరు?నాకు ఎవరు?

Monday, November 1, 2010

నీకై పోరాటం..



హ్రుదయ కుహరాలు తెరచి ఆశల తోరణాలు కడతావా చెప్పు పరుగెత్తుకొచ్చి ప్రాణం ఇస్తా..

ప్రేమ దీపమై ప్రాణానికి వెలుగును ఇస్తావా చెప్పు చిమ్మ చీకటిని చీల్చుకొని నడక సాగిస్తా..

చిన్ని నవ్వుతో మనసు పొరలపై నర్తిస్తావా చెప్పు చిరంజీవిగ బతికేస్తా..

ఓరచూపుతో కరుణిస్తావ చెప్పు లావాలా పెల్లుబికి ప్రపంచంతో పొరాడుతా..

వెన్నెల రాత్రి కన్న వన్నెల కలలను నిజం చేస్తవా చెప్పు జీవితాన్ని అంకితమిస్తా..

మాటల మంత్రంతో ముగ్దున్ని చేస్తావా చెప్పు మరుక్షణమే మరణాన్నైన జయిస్తా..

నీ తోడు కావాలి..



శూన్యపు పొరలు చుట్టేసినపుడు జాబిలి వెలుగులు పంచే ఓ తోడు కావలి..

మౌన వీదుల్లో తిరుగులాడేటప్పుడు ఆనందాన్ని ఇచ్చేటందుకు ఓ స్నేహం కావాలి..

సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతుంతే వెనుక నిలబడి నేనున్నా అని బరొసా ఇచ్చే నేస్తం కావాలి..

జీవిత ఒడిదుదుకులతో అలసిపొయినప్పుడు గతంలో గడిచిన ఓ మధుర స్వప్నం కావాలి..

వృద్దాప్యపు చాయలతో ఒంటరివై నిలచినపుడు నీడలా వచ్చే ఒక జ్ఞాపకం కావాలి..