మనసు ఆలపించే ప్రేమ గీతికలు..మధి మాటున దాగున్న మౌన తరంగాలు..కల్ల నుండి జాలువారె కన్నీటి కధనాలు..ఎదలోతున ఉప్పొంగుతున్న అనుభూతుల అలలు..తీపిగా సాగే వెన్నెల కలలు ..ఆశల కిరణాలు..ఇంకా ఎన్నో ఎన్నెన్నో ..ఇవే నా ఈ "నా మనో భావాలు"..
Sunday, November 21, 2010
ఇదేమి లీలరా నీది శంకరా!..
గంగమ్మను నెత్తిన పెట్టుకోని తాండవమాడేవు,
ఇచ్చట తాగడానికి చుక్క నీరు లేకుండా చేసావు.
ఇదేమి లీలరా నీది శంకరా!..
సురులను రక్షించుటకు గరళాన్ని కంఠంలో దాచి నీలకంఠుడవయ్యావు,
నీ బిడ్డలకు బాధలను మింగి పేదరికాన్ని గుండెల్లో జీర్ణించుకొనే శక్తినిచ్చావు.
ఇదేమి లీలరా నీది శంకరా!..
ఈ భువిపై నువ్వున్న ప్రతిచోటా గౌరమ్మను,ఆమె సవతిని తోడుగా పెట్టుకొన్నావు,
మాకు మాత్రం నువ్వున్న ఇదే భువిపై కష్టాలను తోడుగా పెట్టావు.
ఇదేమి లీలరా నీది శంకరా!..
నిత్యజ్ఞానివైన నీకు కార్తీకపౌర్ణమిన జ్యొతులను వెలిగించమ్మన్నావు,
కాని మమ్ము మాత్రం సత్యమేదో తెలుసుకోలేని అజ్ఞానంలో అలానే ఉంచావు.
ఇదేమి లీలరా నీది శంకరా!..
నిత్య ధ్యానివై సర్వదేవతలచే ఆరాధనలు తీసుకొంటూ కైలాసములో ఆనందముతో వసించేవు,
ఈ కష్టాల కడలిపై మమ్ము త్రోసి ఆ ఒక వంతు భూమిని కూడా కన్నీటిమయము చేసావు,
ఇదేమి లీలరా నీది శంకరా!..
నీకు రెండు కళ్ళుచాలవని మూడవ కన్నుని కూడా పెట్టుకొన్నావు,
పుట్టు గుడ్డివాళ్ళకు,ధన మధ కామ అహంకారులకు ఒక్క కన్ను కూడా లేకుండా చీకటిని ఇచ్చావు..
ఇదేమి లీలరా నీది శంకరా!..
అవేకళ్ళను మూసి అదె చీకటిలో నిన్ను వెతికేవాల్లకి
పరమగతిని చూపి పరంజ్యోతివై పరమార్ధసిద్ధినిచ్చేవు...
ఇదేమి లీలరా నీది శంకరా!..
Subscribe to:
Post Comments (Atom)
6 comments:
inko visyam mee writings lo chala feel vundi andi and chala varaku msgs kuda istunnaru baga..thts wht i like most
chala baga chepparu..inni rojulu me blog ni miss ayinanduku chala badha padutunnanu.ennisarlu chadivina chadavalanipistune vundi..manasu ki chala hai ga vundi..
leela.. leelantaoo gola chesinavu kadara bhaktha kinkaraa...inkemi cheppavale neeku nenu kavi sekharaa..
చాలా బాగా రాశారు..ఆహా!. ఈ లైన్స్ అద్భుతం అండి బాబు!..మాటల్లేవు."అవేకళ్ళను మూసి అదె చీకటిలో నిన్ను వెతికేవాల్లకి
పరమగతిని చూపి పరంజ్యోతివై పరమార్ధసిద్ధినిచ్చేవు...
ఇదేమి లీలరా నీది శంకరా!.."
maheswara గారు చాలా చక్కగా చెప్పారు.మీరు వాడే ప్రతి పధము చాలా ఆనందాన్ని ఇస్తుంది అండి.నేను కూడా ఇప్పటికి చాలా సార్లు చదివాను..చాలా చాలా నచ్చింది అండి..
boss u r writing very well..so nice..keep writing.usage of words are very nice.try to dig into this more.my family also liking ur blog very much..bye
Post a Comment