ఎప్పటిలాగె చీకటి వీధుల్లో ఒంటరిగ నడుస్తున్నాను.ఓ రోజు మాత్రం ఉన్నట్టుండి నా పక్కనుండి సుంగధముల సువాసనలు,పారిజాత పరిమళాలు,వీణా నాదాలు ,ఎదను హత్తుకొనేలా కళ్యాణి రాగం ఇవన్ని గుంపులా చేరి నా పక్కనే నర్తించ సాగాయి నేను అదేదొ కొత్తలోకంలో ఉన్నట్టు.విచిత్ర భావనలతో నా మధి పులకించింది..
అమాంతమున నా చేతి పై తెలియని స్పర్శ.ఆ స్పర్శకి తనువు పులకించింది.వయస్సు తుల్లిపడ సాగింది.హృదయం గాలిలొ తేలినట్టు అయ్యింది.మది ఆనందంతో పరవళ్ళు తొక్కుంతోంది. ఎద సడి అలుపులేకుండా చిందులేస్తోంది. చిత్రమైన చిరునవ్వు.జీవితం ఓ రంగుల హరివిల్లులా అనిపించింది.
గుండె లిప్త పాటు లయతప్పినట్టు కాగా చిన్నపాటి వణుకుతో నెమ్మదిగ తల పక్కకి తిప్పి చూశాను.ఓ అప్సరస పాలమీగడతో తెలుపుని పులుముకొన్న చక్కటి చీరను దరించి పెదవులపై నుండి జారనివ్వని చిన్న చిరు నవ్వుతో నా కల్లలోకి చూస్తు నా చెతి ముని వేల్లను తన చేతితో పట్టుకోని తన వెంట తీసుకెల్లింది సరిగమలు కూడా నృత్యం చేసె ఓ విచిత్రమైన కొత్త లోకానికి.తన వెంట నడక సాగిస్తుంటే తన కురులు నా మోమును అలా తాకి వెళుతుంటే రెండు స్వర్గలోకాల మద్యన ఓ మెత్తటి వారధి పై నడుస్తున్నట్టు అనిపించింది.పక్కనుండి వీచే పిల్ల తెమ్మెరలు, తన మేని పరిమళాలు,తన నుండి వెలువడే వెచ్చటి శ్వాస నన్ను నేను మరచేల మైకాన్ని ఇస్తున్నాయి.ఆ క్షణం రసరాగమయంలా అనిపించింది.
ఆ కొత్త బంగారు లోకం లో ఓ వెండి జాబిలి,ఆ జాబిలిలో ఓ బృందావనం.అందులో రాధామాధవుల ప్రణయ ప్రతిమ.ఎక్కడ చూసిన వెన్నెల వెలుగులు.పక్కనే పారుతున్న సెలయేటి గలగలలు,రంగు రంగుల పుష్పాలు,చిన్నగా చెవులను తాకే సుస్వరాలు ఇలా చాలా, మా ఇద్దరి కోసమె సృష్టించబడ్డ ఓ స్వర్గం లా వుంది.

తను నన్ను మల్లెల బాటపై నడిపిస్తూ ఆ రాధమాదవుల ముందరనె వున్న నందివర్ధనములతో పేర్చి వున్న ఓ పట్టు పరుపు పై కూర్చొబెట్టి తన వడిలో నా తలనుంచి నా నుదురును నిమురుతూ మనసుతో గుసగుసలాడుతూ "ఇప్పుడు చెప్పు ప్రియా! నీతో అ ఏడు అడుగులు వేయడానికి ఎవ్వరు లేరా?" అని..
మరి నువ్వు ఎక్కడి నుండి వచ్చావు,నిజము గా నా వెంటనే వుంటావా?నాతో కలిసి నడుస్తావా? అని నేను అడుగబోతున్నాను, ఇంతలో...
నా వీపుపై బాగా గట్టిగా రెండు దెబ్బలు పడ్డాయి.ఎవ్వరు అని కల్లు తెరచి చూస్తే బారెడు పొద్దెక్కినా మొద్దు నిద్ర,పగటి కలలు ఏంట్రా అని తిడుతు అమ్మ...లేచి చూస్తే ఇదంతా ఓ తియ్యని స్వప్నం..
ఎప్పటిలాగె ఈ జగం చీకటి పడింది అని.కాంతులను విరజిమ్మె రవి కిరణుడు కూడా మెల్లగ తప్పుకొని తన వంటిపై నలుపు ని పులుముకొని తన వెంట దాక్కొని వున్న రాత్రిని కోటి ఆశలతో కంటున్న మన వెన్నెల కలలకు వెలుగును నింపడానికి కాస్త కాలం కనుమరుగయ్యాడని ,మెల్లగా నా కంటి రెప్పలు వెనక చీకటి కనపడ సాగి నాకు తెలియకిండా నేను నిద్రలోకి జారిపొయాను అని,తోడులేని ఒంటరి జీవితపు శూన్యపు నీడల్లొ కాలం గడపాలని తెలిసి కూడా నిదురపోతున్నానని,ఈ శూన్యపు జాడల్లో కూడా కనపడని వెలుగు కోసం,ఓదార్చే వడికోసం ఓ చిన్నపాటి కన్నీటి హృదయంతో మది తచ్చాడుతూ వుంది అని తెలిసింది.ఇదంతా రాత్రి,నిద్ర ఆడిన వింత నాటకం అని గుర్తొచ్హి ఓ తియ్యని నవ్వు నవ్వుకోని నా స్వప్న సుందరికై అన్వేషణ సాగించనారంబించా తనకై పరుగులు సాగించా...
ఇది ఓ అమ్మ-స్వప్నం-అన్వేషణ కథ.
రచన మీ చక్రధర్
No comments:
Post a Comment