అమ్మ,మా,తల్లి,మాయి,మమ్మి,తాయి,మాతా ఇలా ఏ బాషలో పిలిచిన పలికె మనస్సు ఒక్కటే,చూసె చూపు ఒక్కటే,చూపించె ప్రేమ ఒక్కటే.అదే మనం స్వచ్చమైన తెలుగులో పిలిచె అమ్మ.అమ్మ తెలుగు బాషకె ఓ తియ్యదనం.అందుకెనేమో బహుశ తెలుగుని తెలుగు తల్లి అని,ప్రకృతి ని ప్రకృతి తల్లి అని,గోవుని గోమాత అని అంటాం.
అమ్మ అలా అని పిలుస్తుంటేనె గుండె కి తెలెయని ఆనందం,మనసు కి ఓ త్రుప్తి,మన పెదవుల సంపూర్ణ కలయిక.
అమ్మ అంటే ఓ ఆత్మీయానురాగం,ఓ విడదీయలేని బంధం,పేగు పాశం,ఓ తియ్యని స్వరం.అమ్మ ప్రేమ ఓ మాటలకందని మదురానుబూతి.అమ్మ మురిపాలు,మందలింపులు ఓ గొప్ప వరం.పాపడు పలికే తోలిపలుకు అమ్మ.
అమ్మ ఓ చల్లని నీడ,అమ్మ మనసులో ఆవుపాలలోని స్వచ్చత వుంది,అమ్మ ప్రేమ పాల మీగడ ల తియ్యదనం ఉంది,అమ్మ మనసు వెన్నె.అమ్మ హ్రుదయం ఆకాశం లా విస్తారం,అమ్మ ప్రేమ సముద్రమంత లోతు.
అమ్మ అంటే ఓ త్యాగమూర్తి,దివ్య శక్తి,కరుణా మయి.అమ్మ ప్రేమ అజరామరం.
ఓర్పులో భూదేవి అమ్మ.ఓదార్పులో ఆమెకు ఆమె సాటి.ఆమె జోల పాట స్వరాల మూట.అమ్మ ఓ అమృత వర్షిని.
ఉయ్యాలనూపే వయ్యారి చేయి అమ్మది,బావాలకు రెక్కలు పోసెది,ఊపిరినిచ్చేది అమ్మ,చివరకు తండ్రిని పరిచయం చేసెది అమ్మ,ప్రతి ఫలం కోరనిదాత అమ్మ.
అమ్మ మన బతుకులు బాగు పరచడనికి,ఇల్లు చక్కదిద్దడానికి వచ్చిన కోటి దీపపు కాంతుల వెలుగే అమ్మ.అమ్మ ఇంటి మహాలక్ష్మి.నడయాడే దైవం.
ఈ భూమిపై నరకాన్ని కూడా ఆనందంగా అనుబవించేది ఒక్క అమ్మే.అదే మనల్ని నవమాసాలను మోసి కనడం.ఫ్రసవ వేదన బరించడం.అమ్మ మనకోసం బరించే ఈ బాధ ఓ జీవిత కష్టం.పుట్టబోయె తనలోని ప్రతిరూపం కోసం కొండంత ఆశతో ఎదురుచూస్తు బాదలను ఆనందంగ బరిస్తుంది.
అందుకేనేమో దేవుడు ఈ విశ్వకోటిలో సకల ప్రాణులకు అమ్మను స్రుష్టించాడు,అమ్మ ప్రేమను రుచి చూపించాడు.
పుట్టిన రోజు నాడు అమ్మ తీసిన ఎర్ర నీళ్ళ హారతి మరచిపోగలమా,కొనిచ్చిన కొత్తబట్టలను మరచిపోగలమా?
బడికి వెళ్ళెముందు అమ్మ చేతిలో పెట్టిన తాయిలం మరచిపొగలమా,కొరికిచ్చె కొబ్బరి ముక్కను మరచిపోగలమా?
బొమ్మలుకొనుక్కోడానికి పోపుల పెట్టి నుండి తీసిచ్చిన చిల్లర కాసులు మరచిపోగలమా?
మూతి పట్టుకొని తలదువ్వడం,పౌడరు పూయడం,అలసిన నీకు తన చీరకొంగుతో చెమట తుడవడం మరచిపొగలమా?
సాయంత్రంవేళ అరుగుపైన వుండే అమ్మఒడిలో కూర్చొని గ్లాసుతో పాలు తాగడం మరచిపోగలమా?
నాన్న కొడుతుంటే చటుకున్న లాక్కొని తన పైట కొంగులో దాచుకోని పసిబిడ్డను పట్టుకోని కొడతార బుద్దిలేదు అని ఏడ్వడం మరచిపోగలమా?
నువ్వు అలిగి బువ్వ తినకుంటే మ నాన్న కదూ ఒక్క ముద్ద తినరా?లెకుంటే ఈ అమ్మ పై ఓట్టే అని బుజ్జగించి గొరుముద్దలు తినిపించడం మరచిపోగలమా?
తను పస్తులు వుండి నీకు సుస్తుగ పెట్టడం మరచిపోగలమ?(అందుకేనేమొ కడుపు ఆత్రం అమ్మకు తెలుసు అనేది..)
నీ చిన్ని చిన్ని కోరికలకు రాయబారై నీ విన్నపాలను నాన్నకి విన్నవించడం మరచిపోగలమా?
అమ్మ నిన్ను కర్రతీస్కోని కొడుతుంటే అమ్మ కొట్టకే నీ ముద్దుల బిడ్డను చచ్చిపొతానే కొడితే అంటే పక్కున నవ్వి టక్కున లాక్కొని అల్లరి వెదవ అని ముద్దు పెట్టడం మరచిపోగలమా?
డాక్టరు సూది వేస్తుంటే ఏడుస్తున్న నిన్ను హత్తుకోవడం మరచిపోగలమా?
కాళ్ళనెప్పితో నడవలేకుంటే చంకన ఎత్తుకోవడం మరచిపోగలమా?
రోగమొస్తే పక్క విడవక సేవలు చెయడం మరచిపొగలమా?
నీ పెంకితనానికి నెత్తిపై మొట్టికాయ వేయడం మరచిపోగలమా?
అమ్మ పిలిచే పిలుపు నాన్న,కన్న,చిన్న,చిట్టి,బుజ్జి,పండు మరచిపొగలమా?
అమ్మ తనచేతి వేళ్ళతో దిష్టి తీయదం మరచిపోగలమా?
అమ్మ ఉదయాన్నె ముద్దిచి నిద్రలేపడం మరచిపోగలమా?
ఎపుడు నీ బాగు కోసం,భవిష్యత్తు కోసం దెవున్ని ప్రార్దించడం,మ్రొక్కులు చెల్లించడం మరచిపోగలమా?
నువ్వు ఆకతాయితనంతో పొరుగువారితో అల్లరిచేస్తూ గోడవలు తీసుకొస్తే వాల్లనే తిడుతూ నిన్ను సమర్దించడం మరచిపోగలమా?
అమ్మ ఇచ్చె ముద్దు జన్మజన్మలకి నడిచే వచ్చే ఓ తియ్యని జ్ఞాపకం,అమ్మ కౌగిలి ఓ మదురానుబూతి,అమ్మ ఒడే ఈ ప్రకృతి ఇచ్చిన బడి.
వానలో తడిసి వస్తే అన్నయ్య అంటాడు గొడుగు తీసుకెల్లచు కదా అని,చెల్లి సలహా ఇస్తుంది వాన తగ్గే దాక ఆగచ్చు కదా అని,నాన్న తిడతాడు వానలో తడవకూడదని ఎపుడు తెలుసుకొంటావొ ఏమో అని,కాని ఒక్క అమ్మ మాత్రం ఈ పాడు వాన నా బిడ్డ ఇంటికి వచ్చెదాక ఆగకూడద అంటూ తలతుడుస్తుంది.అది అమ్మ అంటే.
ఒకనాడు ఒక అమ్మ,తన 3నెలల కూతురు,తన 60ఏళ్ళ తండ్రి జైలులో ఖైదు చేయబడతారంట.తన బిడ్డ ఏడుస్తుంటే ఆ అమ్మ పాలు ఇస్తుంది అంట.తన తండ్రి కూడ ఆకలితో అలమటిస్తుంటే తన పాలిండ్లతో ఆ తండ్రికి కూడ ఆకలి తీరుస్తుంది అంట.అది తల్లి ప్రేమ అంటే.
అమ్మవిలువ తెలియని వారికి అమ్మ అంటే ఇంతేనా?అదే తెలిసిన వారికి అమ్మ అంటే ఇంతనా!అమ్మ నీకు జోహారు.అమ్మ ఈ జీవితం నీకే అంకితం.అమ్మ నీ ఒడిలొ పసిపాప అయ్యెటందుకు ఎన్ని జన్మలైన మరణిస్తూ,పుడుతూ వుంటా.
మిత్రూలార!దయచేసి అమ్మను తిట్టడం,ఈ గజిబిజి చకచక పరుగులలో అమ్మను నిర్లక్ష్యం చేయడం,పట్టించుకొనే దిక్కులేక ఓల్దేజ్ హోముల్లో పడేయడం,బార్య,భర్తల మోజులో అమ్మను అశ్రద్ద చేయడం వంటివి చేయకండి.దయచేసి అమ్మను మోసం చెయకండి.అమ్మ మనస్సు నొప్పించకండి.అమ్మ కన్నీరుకి మీరు కారణం కాకండి.ఎందుకంటే మీరెన్ని చెసిన కన్నీటి తడితో కూడా బాగుండాలి అని కోరుకొనేది ఒక్క అమ్మే,ఈ ప్రపంచంలో ఇంకా కలుషితం కాకుండ ఏదైన వుంది అంటే అది అమ్మ ప్రేమ ఒక్కటే.
అమ్మ సంస్కృతిని,సంస్కారాన్ని కాపాడుతాం.అమ్మకలలను సాకారం చేద్దాం.ప్రతి ఓక్కరు ఇది పాటిస్తారు అని ఈ చిరు ప్రయత్నం.
మాత్రుదేవోభవ!
రచన మీ
-ఛక్రధర్