Friday, September 17, 2010

ప్రకృతి పరవశం


జాలువారె కన్నీటికి తెలుసు ప్రేమ లోతు ఏమిటో..
ప్రేమించె హ్రుదయానికి తెలుసు గుండె సడి ఏమిటో..
ఎదురుచూసె నిట్టూర్పుకి తెలుసు హ్రుదయ తపన ఏమిటో..
మూగ పోయిన మనసుకు తెలుసు మౌనం విలువ ఏమిటో..
మౌనబాషకి తెలుసు మనసు మాట ఏమిటో..

కన్నె వయ్యారానికి తెలుసు యవ్వనపు సొగసు ఏమిటో..
పడుచు ప్రాయానికి తెలుసు పరువపు పొంగు ఏమిటో..
నిరీక్షించె వయసు కి తెలుసు ప్రాయం జోరు ఏమిటో..
అరవిరసిన అందానికి తెలుసు వలపుల తలపులు ఏమిటో..
తహతహ లాడె పెదవులకు తెలుసు ముద్దు రుచి ఏమిటో..

ఎగసిపడె కెరటానికి తెలుసు గమ్యం ఏమిటో..
అలై పొంగే సాగరానికి తెలుసు ఆకాశం ఎత్తు ఏమిటో..
పండు వెన్నెలకు తెలుసు నిండు వెలుగు ఏమిటో..
ఎవరు లేని ఎడారికి తెలుసు వంటరితనం ఏమిటో..
కలలు కనె కళ్ళకు తెలుసు జీవిత మదురత ఏమిటో..
ఎగిరిపడే మనసుకి తెలుసు ఆనందపు అడుగులు ఏమిటో..

నల్లని కోయిలకు తెలుసు కుహుకుహు రాగాల మదురిమ ఏమిటో..
మీటబడే వీణకు తెలుసు సరిగమల సంగీతం ఏమిటో..
వికసించిన పువ్వు కు తెలుసు  పరిమళాల సుగందం ఏమిటో..
వీచె చల్లని గాలికి తెలుసు సువాసనల వెల్లువ ఏమిటో..
అందమైన నందన వనానికి తెలుసు పువ్వుల గుస గుసలు ఏమిటో..
అల్లరిపిల్లవానికి తెలుసు తుంటరి కొంటెతనం ఏమిటో..

కాల చక్రానికి తెలుసు బతుకు బండి ఏమిటో..
కరిగిపొయె క్షణానికి తెలుసు కష్టం అంటే ఏమిటో..
పొరాడే లక్ష్యానికి తెలుసు గెలుపు మలుపు ఏమిటో..
విశ్రమించని శక్తి కి తెలుసు అలుపు పిలుపు ఏమిటో..
బంగపడ్డ ద్రౌపదికి తెలుసు వలువల విలువ ఏమిటో..
బగవతుండికి తెలుసు ప్రార్దించె బక్తుడి బక్తి ఏమిటో..
సిద్ద గురువుకి తెలుసు శిష్యుని జ్ఞానం ఏమిటో..

ప్రేమ,ఆప్యాయతలకు తెలుసు కౌగిలి సుఖం ఏమిటో
పారాడే పసిపాపడికి తెలుసు అమ్మ వడి స్వచ్చత ఏమిటో..
మాటలు నేర్పిన అమ్మకు తెలుసు పేగు పాసం ఏమిటో..
నడకలు నేర్పిన నాన్నకు తెలుసు అత్మీయ బంధం ఏమిటో..
తోడపుట్టిన వారికి తెలుసు అనురాగల సరాగలు ఎమిటో..

నాకు తెలుసు తెలుగు తియ్యదనం ఎమిటో..

రచన మీ
-ఛక్రధర్



9 comments:

Unknown said...

Keka anna how u get these ideas i dono

Anonymous said...

టపాకి సంబంధం లేని కామెంట్ వ్రాస్తున్నందుకు క్షమించాలి. మలక్పేట్ రౌడీ పెట్టిన ఈ కెలుకుడు బ్లాగ్ చూడండి onlyforpraveen.wordpress.com ఈ బ్లాగ్ లో మలక్పేట్ రౌడీ గ్యాంగ్ వాళ్లు ఎలాంటి అడ్డమైన తిట్లు తిట్టారో చూడండి.

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी said...

బాగుందండీ!

Chakradhar Sarma Rayapati said...

@Manju:emo ra manju naku kuda artam kavadam ledu.hahah..
@Anonymous:ya sure ga chustanu.
@mandakini:thanks andi

Unknown said...

Nowords to praise it.

Anonymous said...

naaku telusu raa nee golento --- hem

Chakradhar Sarma Rayapati said...

@kutti:thx kutti.
@hem:annaya..meeera..hahah

Anonymous said...

very nice,felt it.

Chakradhar Sarma Rayapati said...

thx andi