ఇది గారాల నా చిట్టి చెల్లెలు..
తాకితే కంది పోవును దాని పాల బుగ్గలు..
దాని అందానికి సాటిరావు ఏ మల్లెలు..
ఆటలకై పేర్చెను మరిన్ని గవ్వలు..
తిరిగాం మెమిద్దరం పల్లెపల్లెలు..
చూశాం రంగు రంగుల తిరునాళ్ళు..
కొనిచ్చా దానికి బొలెడన్ని బొమ్మలు..
అది కట్టెను అందమైన వెండి గజ్జెలు..
మోగినవి అవి నా గుండెల్లొ గల్లు గల్లు..
నాట్యమాడెను ఆ వెండి మబ్బులు..
వెలవెల పోయెను ఆ సిరిసిరి మువ్వలు..
తను లక్ష్మిదేవి అయ్యిందని పెట్టారు జడ కుచ్చులు..
తనకోసమై తెచ్చా విరజాజుల,చేమంతుల పువ్వులు..
మురిసిపోయాను చూసి తన నవ్వులు..
ఈ పండుగకు చాలలా వేయి కన్నులు..
నా చిట్టి తల్లి వయసుకు వచ్చెను రెక్కలు..
అయ్యాయి ఓ సుగుణల రాకుమారునితో లగ్గాలు..
తన బుగ్గలు వేసెను సిగ్గుల మొగ్గలు..
పండెను ఈ అన్నయ్య తియ్యని కలలు..
లేవు నా సంతొషానికి పగ్గాలు..
ఈ రోజు కోసమె వెచా ఎన్నో రాత్రి పగల్లు..
మొగించాము ఘనంగా పెళ్ళి బాజాలు..
ఈ సంబరానికి చాలలా వేయి కన్నులు..
తొంగిచూసెను ఈ సందండిని ఆ ముజ్జగాలు..
తను నన్ను వదిలి వెళ్ళడానికి పెట్టెను గగ్గోలు..
మొదలైంది నాకు పట్టరాని దిగులు..
గుచ్చుకొన్నాయి ఈ చిన్ని గుండెకు ముళ్ళులు..
పొంగిపొర్లాయి సెలయేరై కన్నీళ్ళు..
ఏదైతేనేం ఇప్పుడు తను బాధ్యత గల ఓ ఇల్లాలు..
వాళ్ళ ఇంట్లో ఓ బుడతడి గలగలలు
ఇస్తున్నారు స్వర్గం నుండి నాన్నగారు ఆశీస్సులు..
ఎక్కడున్న వుండాలి తను చల్లగా నిండు నూరేళ్ళు..
చెల్లెమ్మ నువ్వేక్కడున్న ఈ అన్నయ్య మనసు నీ వెంటే వుంటుంది,నీ క్షేమమే కొరుకుంటు ఉంటుంది.నా బంగారు తల్లి ఈ అన్నయ్యను మరచి పొవు కదూ..
4 comments:
"నా బంగారు తల్లి ఈ అన్నయ్యను మరచి పొవు కదూ.."
అన్నయ్యను మరిపి౦చే భర్తే తనకు దొరకాలని కోరుకో బ్రదరూ...అ౦తక౦టే అదృష్ట౦ ఏము౦టు౦ది?
avunu nijam meru chepindi.alanti athane dorikadu.
http://www.wix.com loki velli signup cheyandi. daanilo vuntundi chudandi.
Mi blog chalaa baagundi.
bandhaala gurinchi chakkagaa rastunnaru
thanks andi
Post a Comment