Wednesday, September 8, 2010

మ్రుత్యువు ఒడిలో


తథ్యం ప్రాణికి మృత్యువు.. తప్పదు జీవికి వేదన .. జడిగొల్పే దు:ఖంలో .. తడియకుండ గొడుగు లేదు..

మ్రుత్యువు ఆ పేరు వింటేనే గుండెల్లో భయం,మాటల్లో బెరుకు,చేతుల్లో ఒణుకు,వల్లంతా చెమటలు,అర్థం కాని ఆవేదన,కనరాని చీకటి.

గడచిన కాలంలో,గత కొద్దిరోజుల్లో మ్రుత్యువు ఎలా బలిగొందో తెలుసా మొన్న మా నాన్న,నిన్న మా మేనత్త,నేడు మా మమయ్య.డబ్బులకు కొదవలేదు,వైద్యానికి నెలవు వుంది కాని బొందిలో ప్రాణమే నిలబడ్డం లేదు.

ఆ మ్రుత్యువు తల్లి ఒడిలో ప్రతి ఒక్కరు పవలించవలసిందే.ఈ ప్రపంచంలో అతి బయంకరమైనది ఏదైన వుంది అంతే అది చావు తప్ప వేరె ఎమి కాదు. ఆ రక్కసి కబంద హస్తాలో ప్రతి ఒక్కరు నలిగి పోవలసిందే.ఆ మ్రుత్యు త్రాచు కోరల కాటు దెబ్బ ప్రతి ఒక్కరి పై పడవలసిందే.ఆ త్రాచు కోరలకు ప్రతి ఒక్కరు బలి కావలసిందె చివరికి ఆ దేవుడు కూడ.ఆ యమధర్మరాజు పాశానికి మెడ బిగుసుకోక తప్పదు ఎవ్వరికైనా .

నువ్వు అద్బుతాలు చేయవచ్చు కొత్త ప్రపంచాన్ని స్రుష్టించవచ్చు,కోట్లు సంపాదించవచ్చు,టెక్నాలజితో చందరమండలం వెల్లవచ్చు,యోగ సిద్ది పొంది భగవంతున్ని చూడవచ్చు.కాని మ్రుత్యువు ఉత్తరువుని ఎవ్వరూ రద్దు చేయలేరు.ఎంత పిలిచిన వినపడక,ఏమి చెసినా కనపడక,ఉలుకు పలుకు వుండక దేహం నిర్జీవం అయిపోవాల్సిందే.ఒకరి తర్వాత ఒకరు పోవలసిందే కాకపొతే ముందు వెనక తేడా.ఎవ్వరు శాశ్వితం కాదు,ఏది శాశ్వితం కాదు ప్రతి ఒక్కరు పాడె ఎక్కవలసిందే,మట్టిలో కలిసిపొవల్సిందే చితాబస్మం మిగలాల్సిందే.పిండములు పెట్టి పితరులకు తలపోసి కాకుల కోసం ఏదురుచూడవల్సిందే.ప్రతి ఒక్కరు వైతరిణిని దాటవలసిందే. కాలగర్బంలో ఏకమైపొవాల్సిందె.

వికసించిన ప్రతి పువ్వు రాలిపొవలసిందే.ఉదయించిన సూర్యుడు ప్రతి పొద్దున అస్తమించవలసిందే.జన్మించిన ప్రతి మానవుడు తాను ఓ కట్టె అయ్యి అన్ని కట్టెలతో పాటు కాలిపొవలసిందే.ఇదే స్రుష్టి.

రెప్ప్ పాటు కాలంలో ప్రళయం,సెకనుకో జననం గడియకో మరణం.జన్మ మ్రుత్యు జరా వ్యాధి ప్రతి ఒక్కరికి తద్యం.

గీతలో శ్రీక్రుష్ణుడు అన్నట్టు చావు అంటే ఆత్మ బట్టలవలే జీర్నమైన దేహాన్ని త్యజించి కొత్త దేహన్ని దరించడమే అయిన,షిర్డి సాయి అన్నట్టు చనిపొవడమంటే భూమిలోకి పోవడమే కదా ఏడ్వడం దేనికి అన్నా మన అజ్ఞానం పోనంత వరకు,జీవిత పరమావధి తెలుసుకోనంత వరకు,సత్యమేమిటో తెలుసుకొలేనంత వరకు జీవికి ఈ రోదన తప్పదు,జంజాటకాలు తప్పవు,బంధ విముక్తి జరగదు,దు:ఖమును తప్పక దాటలేడు .ఇదే నిజమైన జ్ఞానం,సత్యం,మోక్షం.
 
మిత్రులారా!

జీవిత సత్యాన్ని తెలుసుకోండి,నిజమైన జీవిత గమ్యం ఏమిటో తెలుసుకోండి.దు:ఖ రహితులు కండి.

సర్వే జనా సుఖినో భవంతు,సర్వ మంగళాని తంతు..

రచన మీ

-ఛక్రధర్

No comments: