Thursday, August 19, 2010

ఓ చిన్న కల్పిత ప్రేమ కథ-1(ప్రేమాయనం)


ఇలా తన వైపు మొదలైన నా పరుగుల పయనం పరిచయం నుండి ప్రేమగ మారింది.ఆమె మాటలకు మంత్ర ముగ్దున్ని అయిపొయాను.నన్ను నేను తనువున మరచిపొయాను.తనతొ మాటలాడం తనగురించి తెలుస్కొవడం మొదలు పెట్టాను..రోజు తన మాట కోసం నా హ్రుదయం పరితపించేది.తన పలుకులు తేనెల ఊటల వున్నాయి.పసి పాపలా ముద్దు ముద్దుగ మాటలాడుతు నన్ను అలరించేది.ఈ బుజ్జి పాప చిట్టిపలుకులే నా గుండెలొ ప్రేమకు నాంది పలికాయి.నాలో నిదిరిస్తున్న ప్రేమను తట్టి లేపాయి,నా ప్రేమకు ఆజ్యం పోశాయి..


తన ప్రేమలో పూర్తిగ మునిగిపొయాను.నాకు ప్రతి రోజు ఒక క్రొత్తతనంగ అని పించేది.ఈ ప్రపంచాన్ని మరచి పొయి నా ప్రేయసి అనె కొత్త బంగారు లొకంలొ ఆనందంగ విహరిస్తూ వున్నా ఓ ప్రేమ పక్షిలా.. ఇలా రోజు రోజు కి తన పై పిచ్హి ప్రేమ పెంచుకొంటు పొయాను.

నిరంతరము తనపైన నా ప్రేమ ఆకాశంలా విస్తరిస్తూనే వుంది..ఈ చిన్ని గుండె అంత ప్రెమను దాచుకోలేకుండా పొయింది.తనను ఓ చంటి తల్లిల,బుజ్జి కుట్టిల,తప్పటడుగులను సరిదిద్దె తండ్రిల ముద్దుగ,గోముగ చుస్కొంటు నా ప్రేమామ్రుత దారలను తనపై కురిపిస్తు నా ప్రేమ ను తనకు మాత్రమె పంచుతు తన ఊహల కొలనులో ఈదుతు నన్ను నేను మైమరచిపొయె వాడిని..తనకు నా ప్రేమ గురించి చెప్పె శుభతరుణం కొసం ఆకశం వైపు చూసే వర్షం కోసం ఎదురు చూసే చాతక పక్షి ల ఎదురుచుస్తు వున్నా.

నా ప్రేమలొ నీతి ఉంది.నా నమ్మకం నిజమైంది.నా కల పండింది.ఆ అమ్రుతగడియలు రానె వచాయి.ఒక్కొ దేవునికి ఒక్కొ రోజు వున్నట్టు బహుశ ఇది నా రోజు ఎమొ తను "నేను నిన్ను ప్రేమిస్తున్న ప్రియ" అని చెప్పటం కొసం నీనుండి ఎదురుచుస్తున్నాను అంది.నాకు చెప్పలేని ఆనందం పట్టరాని సంతొషం కలిగాయి..నోటిలొ మాట రాలేదు.క్షణం కూడ ఆలొచించకుండ వెంటనె చెప్పెశ "ఓ ప్రాణమా నేను నిన్ను ప్రేమిస్తున్న,నీ చితిలొ కూడ తోడుంటాను అని".

ఇంతటి ఆనందం అనుభవిస్తూ వుండగ నా గుండెల్లొ ఒక బాణం గుచుకొంది.ఆ అనందం కాస్త క్షణికానందం అయింది.నా గతం గురించి నీకు చెప్పాలి అంది.నేను ఇది వరకె ఒకన్ని ప్రేమించాను,నా సర్వస్వం అతనికే అర్పించాను అంది.విధికి తల వగ్గి కాలవైపరిత్యమున విడిపొయాము అంది.ఇలా భూలోకంలొ తాను అనుభవిస్తున్న నరకం గురించి చెప్పి అంతటి నరకాన్ని ఒక్క నీ ప్రేమతొ స్వర్గం లా మర్చెసావు అంది.నేను ఈ ప్రేమ అనే గమ్యన్ని చేరుటకు మజిలి చెస్తున్న ఓ బాటసారిని.. నీ ప్రేమ అనే చెట్టు నీడలో సేద తీర్చుకోవటం కోసం ఆగాను అంది.నీ చల్లని ప్రేమ నీడ,నీ ఈ తోడు ఎపుడూ కావాలంది.నేనె కావాలి ఈ జన్మకు అంది తన చెయి పట్టుకొని 7 అడుగులు వేయమంది.మన ఈ బంధాన్ని పెళ్ళి బంధంతో ముడి వేద్దాము ఆదర్శ దంపతులుగ నిలుద్దాం,మన ప్రేమను ఈ ప్రపంచనికి చాటి చెపుతామంది.

ఇది వినగానె నా మనసు మూగపొయింది.హ్రుదయం కలత పడింది.మెధడు అలొచనలు లేక మొద్దుబారింది.ఈ నిజాన్ని జీర్నించుకొలెక పోయాను.నా మనసు నెమ్మదించడం కోసం,కాలం చెప్పె జవాబు కొసం,నన్ను నేను సమాదాన పరచుకొవడం కోసం,మనసు ఇరుకునుండి తప్పించి విశాలం చెయటం కొసం ,నా అజరామరమైన ప్రేమ ఇచ్హె సందేశం కొసం..గుప్పెడంత గుండెతొ,ప్రేమించె శ్వాస తో,తను నాకిచ్హిన బరోసాలతో అలొచనల సుడిగుండంలొ దిగి ఎదురుచుస్తూ వుండిపొయ ఏమి చేయాలా అని .

రచన మీ
చక్రధర్