Wednesday, August 25, 2010

ఓ చిన్న కల్పిత ప్రేమ కథ-2(పరిణయం)




ఇలా కాలం తుఫాను వేగం తో ముందుకు దూసుకు పొతోంది.మల్లి మంచి రోజులు రానె వచ్చాయి.నేను కాలంతో పాటు తన గతాన్ని అంతా మరచిపోయ.నన్ను నేను తన కోసం చక్కబడ్డ ఓ అద్బుత శిల్పంలా మలుచుకొన్న.ఇద్దరం పాలు నీల్లలా,బొంగరం తాడులా,పువ్వు దారంలా,చిలక గోరింకలా కలిసిపొయాం.చివరిశ్వాస వరకు తోడువుంటాను అని బాస చేసింది.నదిలా ఊప్పొంగిపొయా.వెంటనే వుండబట్టలెక నా కలలరాని దర్షనం కోసం పట్టనం బయలుదేర.

ఊదయాన్నె తయారు అయ్యి దసరబుల్లోడిల బట్ట కట్టా.జీవితం లో జీవిత బాగస్వామిని కలవడం ఓ మదుర గట్టం కాబట్టి లొలోపల మురిసిపొతూ,వెండి మబ్బుల నవ్వుకొంటు ఆ పరమపవిత్రమైన శనివారము నాడు వేంకటనాధుని సన్నిధి లొ అడుగుపెట్టా.అంతే ఓ పెద్ద అద్బుతం నేను తను అనుకొకుండా ఒకరికి ఒకరు తెలీకుండ చుసుకొన్నాం అదె సన్నిధిలో కలుసుకొన్నాం.నా ప్రేమ నీజము కాబొలు అందుకే ఈ చిన్ని గమ్మత్తు జరిగింది.బహుశ ఇది ప్రేమ చెసే వింత ఎమొ.నా గుండె వేగం పెరింగింది,చెతుల్లొ వనుకు పుట్టింది.మాటలు గగుర్పొడిచాయి.ఆనందం అవదులు దాటింది.

ఆ కొవెల లో నా బంగారు కొండ ఓ జ్యొతి లా, దీపపు కాంతి లా,పసుపు పూసిన గడప లా,మావిడి తోరణం ల,పసిడి పంట లా, ఎర్రటి పారాని లా, సంతొష సంబరాల్ల,అంబరమంటిన దీపావళి వెడుక ల,వెండి మబ్బుల,ఆకశం లొ తారలా,బొమ్మలు గీచే రంగుల కుంచే లా,మొత్తానికి ఓ శ్రావణ మాసపు మహాలక్ష్మి లా కనిపించింది.

వెంటనే లేడి పిల్లలా చెంగున గంతేసి ఆనందంతో అమంతమున తనను పట్టుకొన్న.ఈ క్షణం ఒక మధురానుబూతి ఎపుడైన తిరిగి వస్తుందా అనుబవించిన త్రుప్తె తోడు తప్ప.నా మనసు తనను చుడగానే ఈల వేసి ఇలా వర్ణించింది.

తన సుందరమైన మొహము ఓ చంద్రబింబములా,తన కనులు పద్మాల్లా కను రెప్పలు కలువ రేకుల్లా,తన చంపన వుండె మచ్చే తనకు దిష్టిచుక్కలా,తన మొటిమ తామరాకు పై పడ్డ నీటి బొట్టులా,బుగ్గన పడె సొట్ట పూల బుట్టలా,తన పాపిటి నది పాయలా కనిపిస్తున్నాయి.తన కురులు ఎరుపు,నలుపు రంగుల కలయికతో సాయంసంధ్యలోని ఆ ఎర్రటి ఆకశాన్ని తీగలుగ చేసిపెట్టినట్టున్నాయి.తన మేని పరిమలాల సువాసనలొ మత్తెక్కిపొయా.తను వయ్యారంగ నడిచివస్తుంటె బువి నుండి దివికి నాకొసమే వచ్చిన అప్సరసలా అనిపించింది.తను పాట పాడుతూ పక్కన సాగుతుంటే నడిచె కొయిలమ్మ ల వుంది.ఇల ఎన్నని వర్నించను ఏమని వర్నించను ఆ సుగునాల రాసి ని.

మనసు నెమలి ల పురివిప్పింది.కల్లముందు జీవితం హరివిల్లు ల కనిపించింది.

ఇక ఇద్దరం చట్టా పట్టలేసుకొని నగరం మొత్తం ప్రేమ పక్షుల్ల తిరిగాం.మా జంటను చూసి ఆ దిక్కులె సప్తస్వరాలై స,రి,గ,మలతో స్వాగతం పలికాయి.ఆనందం తో ప్రపంచపు చివరి అంచులదాక వెల్లిపొయాం.తెలెయని అనుబూతి తన కలయిక.ఇలా ఆనందంలో రమిస్తుండగ ఆఖరి రోజు నా స్వస్తానానికి వెల్లిపొయె రొజు రానే వచ్చింది.జీవితం, పెళ్ళి గురించి మాట్లడటానికి శ్రీకారం చుట్టాం.ఎవరి పాపిష్టి కళ్ళు మా పై పడ్డాయో తెలిదు.ఇంతలో ఆకాశాన్ని నల్లని మేఘాలు కమ్ముకొన్నట్టు,తుఫాను వచ్చె ముందు నిశ్శబ్దం ల వాతవరణం అల్లుకుపొయింది.తనను ఎదో తెలెయని బూతం ఆవరించింది.పిచ్చి ప్రస్తావనలు చేసింది,అసందర్బాలు మాట్లడింది,చేసిన బాసలన్నింటిని నీటిమూటలు చెసింది.నేను నీకు జొడి కాదు అంది.ఎందుకో అర్తం కాక,ఏమి దిక్కుతోచక కన్నీటితో నాకు నేనే వీడ్కొలు చెప్పుకొని నా ఇంతి ని వదిలి ఇంటికి తిరిగి పయనమయ్య.