Wednesday, August 18, 2010

ఓ చిన్న కల్పిత ప్రేమ కథ(పరిచయం మాత్రమె)



"ఆ రోజు కుడా రోజులానె ఉదయాన్నె లేచాను ఆఫీసు కి బయలుదేరడనికి.కాని చిన్న గమ్మతు వుంది నేను లేవడం లొ.బహుశ రోజు లేచె దిక్కున కాకుండా నీకు నెనున్న అనె నా ప్రేయసి దిక్కున లేచానేమొ ఆ దేవుని అనుగ్రహంతొ ఏ దిక్కు లేని నేను."ఎందుకంటె ఆ రోజె నా ప్రేయసి దర్శన బాగ్యం జరిగింది".ఇది నా సంద్య వందన పలితమె ఎమొ?.లేక పూర్వ జన్మ సుక్రుతమేమొ ? లెక న అద్రుష్ట రేఖ ప్రభావెమొ? లెక నా గొప్ప మనసు సాదించిన ఘనత ఏమొ?.


ఒక నాడు కటి హస్తంతో వున్న ఆ శ్రీమన్నారయణున్ని నా జీవితానికి ఓ చక్కటి తోదు కావలని భక్తి తో వేడుకొంటుండగ నా నిర్మలమైన,స్వఛమైన మనసు ఆరటపడే తపనకు మెచి,కరునించి నా తండ్రి తదాస్తు అన్నటున్నాడు.అంతె అమాంతంగ

ఓ సాయం సంద్య వేల,అస్తమించె ఎర్రటి సూర్యడు ఆకాశమంత అలుముకొన్న వేల,పక్షులు తన నివాసమునకు చెరు వేల,అన్ని మతాలు ఆ బగవంతున్ని ప్రార్దించు వేల,దేవతలకు నైవెద్యం అర్పించె ముందు గంట మ్రోగించె శుభసమయాన,పసిపాపడు తన అమ్మ వడిలొ పలు తాగె సమయాన,కోయిల కుహురాగల సవ్వడిలొ

వసంత కాలం లొ చిగురించిన కొమ్మ పై పడ్డ ఓ వాన చినుకు ల,ఓ పడమటి సంద్యరాగం ల,పరిమలాలు వెదజల్లె వికసించిన పుష్పం ల,ఓ బంగారు కొండల,ముద్దుల పంచవర్నపు చిలకమ్మ ల,రంగు రెక్కల సీతాకోకచిలుక ల, పాల మీగడ ల తియ్యగ,అమ్మ ప్రేమ ల కమ్మగ "నేనున్న నీ జీవితానికి తోడు,నీ జన్మ నాతో ముడి పదింది,నాతోనె నీ 7 అడుగులంటు,నీ చెయి ఎన్నటికి వీడనంటు, తన చెయి నాకందించి నెనున్నా అనె బరోస ఇస్తు ఒక సౌందర్యమైన మొహముతొ, చిరు నవ్వుతొ, ప్రెమించె హ్రుదయం తొ ఓ ప్రెమ గీతికల,దెవకన్య ల నా ప్రేయసి,అరవిరసిన మందారం నా సిందురం కనిపించింది.

చీకటి మయమైన నా జీవితంలో కి నులివెచని కాంతి పుంజం ల వెలుగినిచేటందుకు అడుగు పెట్టింది..నా జన్మ తరించింది.న గుండెల్లొ తెలియని అలజడి రేగింది,వెంటనె జీవితం పై యెనలెని ఆశ మొదలైంది,మనసు తన తోడు కొరుకుంది.వెంటనే తన వైపు పరుగులు తీయడం సాగించాను.." అంతె ఇలా జరిగింది న దేవత తో న పరిచయం"..ఇలా మొదలైంది నా ప్రేమ కథ ఓ విచిత్రమైన బంధం తో.

-రచన మీ

చక్రధర్

3 comments:

Anonymous said...

Mitramaa,
Neeloni ee kavithagunaniki naa joharlu.
neevu ponduparachina padabandalu chala muchhatesthunnayi. Nee kavitha vaahini vuvvethunna egasina keratam sagipovalani manasara aakankshistu..!

-Siva

Chakradhar Sarma Rayapati said...

danyavaadalu siva

Unknown said...

Hatsoff to your usage of words.